Varun Singh's death news: హెలీక్యాప్టర్ కూలిన ఘటనలో గాయపడిన వరుణ్ సింగ్ మృతి.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

Varun Singh's death news live updates: తమిళనాడులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన హెలీక్యాప్టర్ కూలిన ఘటనలో ప్రాణాలతో బయటపడిన గ్రూప్ కెప్టేన్ వరుణ్ సింగ్ ఇక లేరు. ఈ దుర్ఘటనలో హెలీక్యాప్టర్‌లో ఉన్న 14 మందిలో డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ బిపిన్ రావత్ (CDS Bipin Rawat), ఆయన సతీమణి మధులికా రావత్ సహా 13 మంది ప్రాణాలు కోల్పోగా.. గ్రూప్ కేప్టేన్ వరుణ్ సింగ్ ఒక్కరే తీవ్ర గాయాలతో బయపడిన సంగతి తెలిసిందే.

Written by - Pavan | Last Updated : Dec 15, 2021, 01:57 PM IST
Varun Singh's death news: హెలీక్యాప్టర్ కూలిన ఘటనలో గాయపడిన వరుణ్ సింగ్ మృతి.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

Varun Singh's death news live updates: తమిళనాడులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన హెలీక్యాప్టర్ కూలిన ఘటనలో ప్రాణాలతో బయటపడిన గ్రూప్ కెప్టేన్ వరుణ్ సింగ్ ఇక లేరు. ఈ దుర్ఘటనలో హెలీక్యాప్టర్‌లో ఉన్న 14 మందిలో డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ బిపిన్ రావత్ (CDS Bipin Rawat), ఆయన సతీమణి మధులికా రావత్ సహా 13 మంది ప్రాణాలు కోల్పోగా.. గ్రూప్ కేప్టేన్ వరుణ్ సింగ్ ఒక్కరే తీవ్ర గాయాలతో బయపడిన సంగతి తెలిసిందే. 

డిసెంబర్ 8న ఈ ఘటన చోటుచేసుకోగా.. ఘటనా స్థలం నుంచి వెల్లింగ్టన్‌లోని మిలిటరీ ఆస్పత్రికి చికిత్స అందించారు. మరింత మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి బెంగళూరులోని కమాండ్ హాస్పిటల్‌కి తరలించారు. కాగా అక్కడే వరుణ్ సింగ్ చికిత్స పొందుతూ చావు, బతుకుల మధ్య యుద్ధం చేసిన వరుణ్ సింగ్ ఇవాళ బుధవారం ఉదయం తుది శ్వాస విడిచినట్టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) ప్రకటించింది.

Varun Singh's death news live updates

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కేప్టేన్ వరుణ్ సింగ్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వరుణ్ సింగ్ మృతి తనను తీవ్రంగా కలిచివేసిందన్న ప్రధాని మోదీ.. ఆయన దేశానికి అందించిన సేవలు ఎప్పటికీ మరువలేనివి అని అన్నారు. వరుణ్ సింగ్ కుటుంబసభ్యులకు, ఆయన మిత్రులకు ప్రధాని మోదీ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

సీడీఎస్ బిపిన్ రావత్ (Bipin Rawat death news) సహా ఆరోజు మృతి చెందిన మిగతా 12 మంది మరణం తర్వాత వరుణ్ సింగ్ మృతి (Varun Singh death news) దేశంలో మరోసారి విషాదాన్ని నింపింది.

Also read : Indian Railways Luggage Rules: రైలు ప్రయాణంలో లగేజ్ నిబంధనల గురించి తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News