Reliance Jio Recharge Plans: రిలయన్స్ జియో వివిధ రకాల ప్లాన్స్ అందిస్తోంది. దీర్ఘకాలిక వ్యాలిడిటీ, లిమిటెడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్. ఈ మూడింటిలో ఏది కావాలంటే అదే ప్రాధాన్యత కలిగిన రీఛార్జ్ ప్లాన్స్ కూడా అందిస్తుంటుంది. ప్రతి ప్లాన్‌తో ఎస్ఎంఎస్, జియో యాప్స్ యాక్సెస్ అదనంగా లభిస్తాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తవానికి గత ఏడాది జూన్ నెలలో రిలయన్స్ జియో సహా అన్ని ప్రైవేట్ టెలీకం కంపెనీలు టారిఫ్ రేట్లు పెంచుకున్నాయి. అయితే కొత్త కొత్త ప్లాన్స్ ప్రవేశపెడుతూ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అదే సమయంలో కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ ప్లాన్లు కూడా అందించాలని ట్రాయ్ ఆదేశించింది. ఎందుకంటే చాలామందికి కాలింగ్ తప్ప డేటాతో పెద్దగా పని ఉండకపోవచ్చు. ట్రాయ్ ఆదేశాలతో అన్ని టెలీకం కంపెనీలు కేవలం కాలింగ్ లేదా కేవలం ఎస్ఎంఎస్ ఉన్న ప్లాన్స్ అందించే పనిలో ఉన్నాయి. ఇందులో భాగంగా రిలయన్స్ జియో మూడు ప్లాన్స్ అందిస్తోంది. వీటిలో కేవలం వాయిస్ కాలింగ్ ఉంటుంది డేటా తక్కువగా ఉంటుంది. రోజువారీ డేటా అవసరం లేనివారికి ఈ ప్లాన్స్ అద్భుతంగా ఉపయోగపడనున్నాయి. ఇంట్లో వైఫై సౌకర్యం ఉండేవారికి ఈ ప్లాన్స్ అనుకూలంగా ఉంటాయి. 


జియో 1899 ప్లాన్


ఈ ప్లాన్ లాంగ్ వ్యాలిడిటీ కలిగింది. 336 రోజుల కాలవ్యవధి కలిగి ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే్ మొత్తం 336 రోజులకు కలిపి 24 జీబీ డేటా లభిస్తుంది. వాయిస్ కాలింగ్ మాత్రం అన్‌లిమిటెడ్. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా పంపించుకోవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాప్స్ ఉచిత యాక్సెస్ ఉంటుంది. 


జియో 189 ప్లాన్


జియో యూజర్లకు 189 రూపాయల వ్యాల్యూ ప్లాన్ ఇది. కేవలం 28 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. 28 రోజులకు కలిపి 2 జీబీ డేటా ఉంటుంది. రోజుకు వంద ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాప్స్ ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. 


జియో 479 ప్లాన్


ఈ ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. మొత్తం 6 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఉంటుంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ ఉచిత యాక్సెస్ లభిస్తుంది. 


Also read: Delhi Elections: కేంద్ర బడ్జెట్‌పై ఎన్నికల కమీషన్ ఆంక్షలు, ఢిల్లీని బడ్జెట్ నుంచి మినహాయించాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.