Delhi Elections: కేంద్ర బడ్జెట్‌పై ఎన్నికల కమీషన్ ఆంక్షలు, ఢిల్లీని బడ్జెట్ నుంచి మినహాయించాలి

Delhi Elections: దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల నగారా మోగింది. అన్ని పార్టీలు హోరాహోరీ సమరానికి సిద్ధమౌతున్నాయి. సరిగ్గే ఇదే సమయంలో కేంద్ర బడ్జెట్ ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 7, 2025, 05:35 PM IST
Delhi Elections: కేంద్ర బడ్జెట్‌పై ఎన్నికల కమీషన్ ఆంక్షలు, ఢిల్లీని బడ్జెట్ నుంచి మినహాయించాలి

Delhi Elections: ఓ వైపు ఢిల్లీ ఎన్నికలు మరోవైపు కేంద్ర బడ్జెట్ రెండూ ఒకే సమయంలో ఉండనున్నాయి. ఢిల్లీ ఎన్నికలపై కేంద్ర బడ్జెట్ ప్రభావం పడకుండా ఎన్నికల కమీషన్ కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. బడ్జెట్‌పై నిబంధనలు విధించింది. 

కేంద్ర ఎన్నికల కమీషన్ ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 5వ తేదీ ఢిల్లీ ఎన్నికలు జరగనున్నాయి. 8వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. ఈ నెల 10న గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ జనవరి 17 కాగా 18వ తేదీన పరిశీలన ఉంటుంది. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు 20వ తేదీ వరకూ గడువుంటుంది. ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ విడదలతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. 

సరిగ్గే ఇదే సమయంలో అంటే ఢిల్లీ ఎన్నికలకు నాలుగు రోజుల ముందు అంటే ఫిబ్రవరి 1న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే కేంద్ర బడ్జెట్‌పై కసరత్తు జరుగుతోంది. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పాటు కోడ్ అమల్లోకి రావడంతో బడ్జెట్ ప్రభావం ఎన్నికలపై పడుతుందనే విమర్శలు వచ్చాయి. ఢిల్లీ ఎన్నికల్ని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రూపంలో అడ్వాంటేజ్ తీసుకునే ప్రమాదం లేకపోలేదు. ఢిల్లీకు భారీగా తాయిలాలు ప్రకటించవచ్చు. ఈ క్రమంలో ఎన్నికల కమీషనర్ రాజీవ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. కేంద్ర బడ్జెట్ లో ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి కేటాయింపులు ఉండకూడదని స్పష్టం చేశారు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గ కార్యదర్శికి ఎన్నికల కమీషన్ లేఖ రాయనుంది. ఢిల్లీ తప్ప మిగిలిన రాష్ట్రాలకు పథకాలు, కేటాయింపులు చేసుకోవచ్చు. 

Also read: ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకు టీమ్ ఇండియా జట్టులో ఎవరికి అవకాశం, ఎవరికి నో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News