Jio Prepaid plan Offers: నెట్‌ప్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ వీక్షించాలంటే ఎవరివారు సబ్‌స్క్రిప్షన్ తీసుకోవల్సిందే. పాస్‌వర్డ్ షేరింగ్ ఉండదు. అమెజాన్ ప్రైమ్ ధర పెంచేసింది. దాంతో ఓటీటీలకు అలవాటయినవారికి ఖర్చు మరింత పెరగనుంది. కానీ రిలయన్స్ జియో ఆఫర్ చేస్తున్న ప్లాన్స్ తీసుకుంటే ఈ ఓటీటీ సేవలు ఉచితంగానే పొందవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రిలయన్స్ జియో కొన్ని రకాల ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్స్ తీసుకున్నవారికి ఉచితంగా కొన్ని ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ ఆఫర్ చేస్తోంది. వీటిలో నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ కూడా ఉండటం విశేషం. మీరు కూడా జియో ప్రీ పెయిడ్ కస్టమర్ అయితే ఈ ప్లాన్స్ తీసుకుంటే ఇకపై ఉచితంగానే ఓటీటీలు వీక్షించవచ్చు. ఆ ప్లాన్స్ ఏంటో తెలుసుకుందాం. మొత్తం ఐదు ప్లాన్స్ ఉన్నాయి. 


జియో 398 ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకుంటే 28 రోజులకు వర్తిస్తుంది. ఈ ప్లాన్‌లో రోజుకు 2జీబీ హైస్పీడ్ డేటా చొప్పున మొత్తం 56 జీబీ డేటా లభిస్తుంది. అపరిమితమైన వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌ల సౌకర్యం ఉంటుంది. ఇది కాకుండా జియో టీవీ యాప్ ఉచిత యాక్సెస్ ఉంటుంది. ఇక ఓటీటీల విషయంలో సోనీలివ్, జీ5, లయన్ గేట్‌ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ నెక్స్ట్, జియో సినిమా ప్రీమియం ఉచితంగా వీక్షించవచ్చు. 


జియో 857 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల కాలపరిమితితో వస్తుంది. ఇందులో రోజుకు 2 జీబీ డేటా చొప్పున మొత్తం 168 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో కూడా రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, అపరిమితమైన కాాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌తో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్ ఉచితంగా ఉంటుంది. 84 రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. 


జియో 1099 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో రోజుకు 2 జీబీ డేటా చొప్పున 168 జీబీ ఉంటుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్, అపరిమితమైన కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ఎడిషన్ 84 రోజులపాటు ఎంజాయ్ చేయవచ్చు. దీంతో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ ఉంటాయి. 5జీ ఫోన్ అయితే మాత్రం అన్‌లిమిటెడ్ 5జి డేటా పొందవచ్చు.


జియో 1198 ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. ఇందులో రోజుకు 2 జీబీ డేటా చొప్పున 168 డీబీ డేటా లబిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, అపరిమితమైన కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ తీసుకుంటే అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీ లివ్, జీ5, లయన్స్ గేట్ ఇంకా కొన్ని ఇతర ఓటీటీలు 84 రోజులపాటు ఉచితంగా వీక్షించవచ్చు. జియో సినిమా ప్రీమియం కావాలంటే అదనంగా చెల్లించాల్సిందే.


జియో 3227 ప్రీపెయిడ్ ప్లాన్ ఏడాది కాల పరిమితితో వస్తోంది. ఇందులో కూడా రోజుకు 2 జీబీ డేటా చొప్పున మొత్తం ఏడాదికి 730 జీబీ లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. అపరిమితమైన కాల్స్ ఉంటాయి. ఇక అమెజాన్ ప్రైమ్ ఏడాది పాటు మొబైల్ ఎడిషన్ ఉంటుంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్ పొందవచ్చు. 


Also read: IT Return Tips: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా, ఈ పొరపాట్లు చేయవద్దు లేకపోతే చట్టపరమైన చర్యలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook