Jio 999 Recharge Plan: దేశంలో అతి పెద్ద ప్రైవేట్ టెలికం కంపెనీగా ఉన్న రిలయన్స్ జియో అందుబాటు ధరలతో చాలా ప్లాన్స్ అందిస్తోంది. అన్ లిమిటెడ్ కాలింగ్, అన్‌లిమిటెడ్ హై స్పీడ్ డేటా, భారీగా ఓటీటీ సేవలు అందిస్తోంది. ఇంతకీ ఇన్ని ప్రయోజనాలు అందించే ఆ ప్లాన్ వివరాలు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రిలయన్స్ జియో కొత్తగా అందిస్తున్న రీఛార్జ్ ప్లాన్ 999 రూపాయలది. ఇదొక ఫైబర్ ప్లాన్. ఈ ప్లాన్‌తో చాలా ప్రయోజనాలు అందుతాయి. ఇందులోనే వార్షిక ప్లాన్ తీసుకుంటే 30 రోజులు అదనంగా వ్యాలిడిటీ లభిస్తుంది. జియో 999 రూపాయల ఫైబర్ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు ఉంటుంది. ఈ 30 రోజుల్లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఉంటుంది. జియో 999 రీఛార్జ్ ప్లాన్‌లో ఇంకా రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. 150 ఎంబీపీఎస్ హైస్పీడ్ అన్‌లిమిటెడ్ డేటా పొందవచ్చు. 


అన్నింటికీ మించి ఈ ప్లాన్‌తో కలిగే బెస్ట్ బెనిఫిట్ ఓటీటీ సేవలు. ఏకంగా 15కు పైగా ఓటీటీ సేవలు ఉచితంగా లభిస్తాయి. ఇందులో అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీ లివ్, జియో సినిమా, ఏఎల్టీ బాలాజీ, ఎరోస్ నౌ, షెమారూ మి, డోకుబే, ఎపికాన్, సన్ ఎన్ఎక్స్‌టి, హోయ్ చోయ్, లయన్స్ గేట్ ప్లే, ఈటీవీ విన్ ఓటీటీలతో పాటు 550కు పైగా టీవీ ఛానెల్స్ ఉచితంగా అందుతాయి. 


ఇదే ప్లాన్ ప్రయోజనాలను వార్షికంగా కూడా పొందవచ్చు. జియో ఫైబర్ 999 ప్లాన్ ఏడాదికి తీసుకుంటే 11,998 రూపాయలు అవుతుంది. జీఎస్టీ అదనంగా చెల్లించాలి. ఏడాది ప్లాన్ ఇవే ప్రయోజనాలతో పాటు అదనంగా 30 రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే 365 రోజులు కాకుండా మరో 30 రోజులు ప్లాన్ పనిచేస్తుంది. 


Also read: Adani Power: బంగ్లాదేశ్‌కు కరెంటు సప్లై చేస్తాం..గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారమే విద్యుత్ సరఫరా : అదానీ పవర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook