Reliance Industries: ఇండియన్ బిగ్ జయంట్ రిలయన్స్ అధినేత మరో అరుదైన ఘనత దక్కించుకోనున్నారు. ఇప్పటికే పలు అంశాల్లో టాప్‌లో ఉన్న ముకేష్ అంబానీ..సంపాదనలో వంద బిలియన్ డాలర్లకు చేరువలో ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా, ఆసియలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries) ఛీఫ్ ముకేష్ అంబానీ మరో కీర్తి సాధించనున్నారు. ముకేష్ సంపాదన వంద బిలియన్ డాలర్లు అంటే పదివేల కోట్లకు చేరుకోబోతున్నారు. రిలయన్స్ షేర్ల విలువ(Reliance Share Value) అమాంతంగా పెరగడంతో అంబానీ నికర విలువ 3.71 బిలియన్ డాలర్లు అంటే 27 వేల 81 డాలర్లకు పెరిగింది. ఈ ఏడాదిలో ముకేష్ నికర విలువ 15.9 బిలియన్ డాలర్లు పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రస్తుతం 92.6 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచ ధనికుల జాబితాలో ముకేష్(Mukesh Ambani)12వ స్థానంలో ఉన్నారు. మరోవైపు రిలయన్స్ స్టాక్ షేర్లు కూడా ఈ వారంలో అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. బోంబే స్టాక్ ఎక్స్చేంజ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 4.12 శాతం పైకి ఎగసి..2 వేల 388 రూపాయల వద్ద ముగిసింది. 


రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్, రిలయన్స్(Reliance)గ్రూప్ కంపెనీ జస్ట్ డయల్ లిమిటెడ్‌ను నియంత్రణలో తీసుకుంది. సెబీ (SEBI)టేకోవర్ నిబంధనల ప్రకారం కంపెనీని నియంత్రించేందుకు అవసరమైన వాటాను ఆర్ఆర్‌విఎల్ కొనుగోలు చేసింది. జస్ట్ డయల్‌లో ఆర్ఆర్ విఎల్‌కు 40.98 శాతం వాటా ఉంది. ప్రపంచంలో ఇప్పుడు 201 బిలియన్ డాలర్లతో జెఫ్ బెజోస్ అగ్రస్థానంలో ఉండగా..199 బిలియన్ డాలర్లతో ఎలాన్ మస్క్ రెండవ స్థానంలో ఉన్నారు. బిల్‌గేట్స్, మార్గ్ జుకర్‌బర్గ్‌లు 4, 5 స్థానాల్లో ఉన్నారు. 


Also read: Best Selling Cars: పండుగ సీజన్ లో ఏ కంపెనీ కార్ల అమ్మకాలు ఎలా ఉన్నాయో తెలుసా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook