Jiomart Express: ఇప్పుడు విక్రయాలన్నీ ఆన్‌లైన్ పైనే ఆధారపడుతున్నాయి. ఆర్డర్ ఏదైనా నిమిషాల్లో ఇంటికి డెలివరీ చేసే సేవలు ఎక్కువవుతున్నాయి. ఇదొక అంతులేని వ్యాపారం. అందుకే ఇప్పుడీ వ్యాపారంలో..రిలయన్స్ జియో మార్ట్ అడుగుపెడుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆన్‌లైన్ సేవలు రోజురోజుకూ వేగవంతమౌతున్నాయి. డెలివరీ రంగంలో పెరుగుతున్న పోటీతో వివిధ సంస్థలు పోటీ పడి తక్కువ వ్యవధిలో కస్టమర్ ఆర్డర్‌ను కోరిన చోటుకు డెలివరీ చేసే యంత్రాంగం సమర్ధవంతంగా పనిచేస్తోంది. అందుకే ఈ వ్యాపారంలో దిగ్గజ కంపెనీలు అడుగిడుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు రిలయన్స్ రిటైల్ ముందుకొచ్చింది. 


జియోమార్ట్ ఎక్స్‌ప్రెస్ పేరుతో పైలట్ ప్రాజెక్టుగా నవీ ముంబైలో ప్రారంభించిన సేవల్ని విస్తరించనుంది. ఈ ఆర్ధిక సంవత్సరం చివరినాటికి జియోమార్ట్ ఎక్స్‌ప్రెస్ సేవల్ని దేశంలో 2 వందల నగరాలకు పైగా విస్తరించాలని యోచిస్తోంది. కేవలం 90 నిమిషాల్లోనే డెలివరీ చేస్తామని చెబుతోంది. ఆర్డర్ కనీస వ్యాల్యూ 199 రూపాయలుండాలి. జియోమార్ట్ ఎక్స్‌ప్రెస్ విస్తరణతో..జొమాటో, స్విగ్గీ, టాటా న్యూ, ఓలా వంటి కంపెనీలకు పోటీ ఎదురుకానుంది. వేగంగా సరుకు రవాణా నిమిత్తం స్థానిక కిరానా స్టోర్స్‌ను హైపర్ లోకల్ హబ్స్‌గా ఉపయోగించనుంది రిలయన్స్. ప్రజల అభిరుచులకు తగ్గట్టుగా..క్విక్ కామర్స్ రంగంలో సత్తా చాటాలనేది రిలయన్స్ ఆలోచనగా ఉంది. 


ఇప్పటికే ముంబైలో రెండు వేలకు పైగా ఉత్పత్తుల్ని కవర్ చేస్తూ..వేగంగా సేవలందిస్తోంది. ఇందులో భాగంగా డన్జో డైలీ సహకారం తీసుకుంటోంది. డన్జో డైలీ అనేది 2021లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబైల్లో ప్రారంభమైంది. వ్యాపార విస్తరణలో భాగంగా...రిలయన్స్.. డన్జోతో పాటు నెట్‌మెడ్స్, ఆస్టెరియా, జస్ట్ డయల్, అర్బన్ లాడర్ వంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది. 


Also read: EPF Interest Rate: పీఎఫ్ ఖాతాదారులకు నిరాశ, ఈపీఎఫ్ వడ్డీరేటులో భారీగా కోత, 8.10 శాతం మాత్రమే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook