LTCG Tax: కొత్త రూల్స్ వాయిదా వేసిన కేంద్రం.. ఇక LTCG పై పన్ను ఆదా చేసుకునే అవకాశం..!
Long Term Investment: కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2024-25లో తీసుకువచ్చిన LTCG కాలిక్యులేషన్ లో మార్పులు ప్రకటించారు. కొత్త రూల్స్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తేదీ 2024 జులై 23వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే ఈ రూల్స్ అమలు చేసే తేదీని ఇప్పుడు పొడిగిస్తున్నారు. దీంతో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పై భారీగా ఆదా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. LTCG, ఇండిక్సేషన్ మార్పులను వచ్చే ఏడాదికి వాయిదే వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Long Term Capital Gains Tax: ఇంటి యజమానులకు ట్యాక్స్ రిలీఫ్ కల్పించే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత నెల ప్రవేశపెట్టి వార్షిక బడ్జెట్ 2024-25లో దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను విధింపులో కీలక మార్పులు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై పలు వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయంటూ కేంద్రానికి వారు సూచించారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నిబంధనల్లో మార్పులు చేస్తూ ప్రాపర్టీ, గోల్డ్, అన్ లిస్టెడ్ అసెట్లకు ఇండికేషన్స్ బెనిఫిట్స్ కేంద్రం తొలగించింది. దీంతో మూలధన లాభాలపై ద్రవ్యోల్బణం ఆధారంగా పన్ను తగ్గించే ఛాన్స్ లేకుండా పోతుంది. ప్రస్తుతం ఉన్న ఈ కొత్త్ రూల్స్ ను సవరించాలంటూ వాటి అమలు వాయిదా వేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ యోచిస్తున్న జాతీయ మీడియా పేర్కొంటోంది.
బిజినెస్ స్టాండర్డ్ రిపోర్టు ప్రకారం కొత్త రూల్స్ అమలు చేసే తేదీని పొడిగించాలని భావిస్తున్నారు. 2025-26 వ ఆర్థిక సంవత్సరం నుంచి వీటిని అమల్లోకి తీసుకువచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. పన్ను విధించతగిన క్యాపిటల్ గెయిన్ ను తగ్గించగల ఆస్తి సహా అన్ని అస్సెట్ క్లాసులకు ఇండెక్సేషన్ ప్రయోజనాలను అనుమతించడం గురించి చర్చలు జరుగుతున్నాయి. 2024-జులై 23 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రూల్స్, క్యాపిటల్ గెయిన్స్ కాలిక్యులేషన్ లో గణనీయమైన మార్పులను ప్రవేశపెట్టాయి. ఈ మార్పులు ఇండెక్సేషన్ గా పేర్కొనే ద్రవ్యోల్బణం ఆధారంగా అక్విజిషన్ కాస్ట్ ను సర్దుబాటు చేసే సామర్థ్యంను తొలగించాయి. అస్సెట్స్, బంగారం లేదా ఇతర అన్ లిస్టెడ్ ప్రాపర్టీలను విక్రయించే వ్యక్తుల పన్ను భారాన్ని మరింత పెంచుతుంది. ప్రాపర్టీ యజమానులకు ఉపశమనం కలించే ఉద్దేశ్యంతోనే కొన్ని మార్పులు తీసుకురానున్నారని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
Also Read : EV July Sales: జులై అమ్మకాల్లో దుమ్ములేపిన ఈవీలు...విక్రయాల్లో ఏకంగా 55శాతం వృద్ధి..!!
ఈ ప్రతిపాదన రియల్ ఎస్టేట్ లావాదేవీలకు సంబంధించి ఆందోళనలను మరింత పెంచింది. ఎందుకంటే ఇండెక్సేషన్ చారిత్రాత్మకంగా పన్ను గణనలలో ద్రవ్యోల్బణాన్ని లెక్కించడానికి ఇంటి యజమానులకు అవకాశం ఇచ్చింది. వాస్తవానికి ఈ కొత్త రూల్ ప్రకారం...ఇంటి యజమానులు ద్రవ్యోల్బణం కోసం సర్దుబాలు చేసే అవకాశాన్ని తొలగించాయి. ఈ మార్పులు అనేవి పన్ను భారాన్ని మరింత పెంచే అవకాశం ఉంది. ప్రత్యేకించి తక్కువ విక్రయ ధరలతో పాత ఆస్తులపై ప్రభావం చూపుతుంది. ఇండెక్సేషన్ అనేది కాలక్రమేణా ద్రవ్యోల్బణం కోసం ఆస్తి కొనుగోలు ధరను సర్దుబాటు చేయడానికి ఉపయోగించే పద్ధతి. అమ్మకంపై పన్ను విధించే మూలధన లాభాలను తగ్గించడం. ఇండెక్సేషన్‌ను తీసివేయడం ద్వారా, పన్ను గణన ప్రక్రియను మరింత సులభం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read : Refund Scam: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్..ఈ SMS వచ్చిందా? క్లిక్ చేశారంటే మీ డబ్బులు గోవిందా..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter