Electric Vehicle July Sales : దేశంలో ఈవీల అమ్మకాలు జోరుమీదున్నాయి. జులైలో మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ విక్రయాలు 1,79,038 యూనిట్లకు చేరాయి. గతేడాది ఇదే సమయంలో నమోదు అయిన 1,16,221 యూనిట్ల విక్రయాలతో పోల్చితే 55.2శాతం వృద్ధి నమోదు అయ్యింది. అదే సమయంలో టూవీలర్ విక్రయాలు కూడా 96శాతం పెరిగాయని ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఫాడా మంగళవారం వెల్లడించింది. కంపెనీలు ఆకట్లుకునే ఆఫర్స్, డిస్కౌంట్స్ అందించడం వల్ల ఇ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ ను పొడిగించడమే ఇందుకు కారణమని ఫాడా పేర్కొంది. కాగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాలు గత నెలలో 95.94 శాతం పెరిగి 1,07,016 యూనిట్లకు చేరుకున్నాయి. జూలై 2023లో, ఈ సంఖ్య 54,616 యూనిట్లుగా ఉంది.
రెట్టింపు అయిన వాణిజ్య వాహనాల అమ్మకాలు:
అదే సమయంలో, ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ల అమ్మకాలు 18.18 శాతం పెరిగి 63,667 యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే నెలలో ఇది 58,873 యూనిట్లుగా ఉంది. FADA డేటా ప్రకారం, సమీక్షిస్తున్న నెలలో వాణిజ్య వాహనాల అమ్మకాలు రెట్టింపు కంటే ఎక్కువ పెరిగి 816 యూనిట్లకు చేరుకున్నాయని పేర్కొంది. గతేడాది జూలైలో 364 వాణిజ్య వాహనాలు అమ్ముడు అయ్యాయి. అయితే, జూలైలో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 2.92 శాతం క్షీణించి 7,541 యూనిట్లకు చేరుకున్నాయి. జూలై 2023లో ఇది 7,768 యూనిట్లుగా ఉంది. జులై లో టూవీలర్, త్రీవీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ విభాగంలో పెరుగుతున్న మార్కెట్ వాటానే దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కు పెరుగుతున్న ఆదరణను సూచిస్తుందని ఫాడా అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా వెల్లడించారు.
FADA ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా మాట్లాడుతూ..జూలైలో వృద్ధి రేట్లు వరుసగా 95.94 శాతం, 18.18 శాతంగా ఉన్నట్లు తెలిపారు. కాగా, మార్కెట్ వాటా వరుసగా 7.4 శాతం, 57.6 శాతంగా ఉంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ, డిమాండ్ పెరుగుతోందని ఇది స్పష్టం చేస్తోందని, ప్యాసింజర్ వాహన విభాగంలో వార్షిక ప్రాతిపదికన 2.92 శాతం స్వల్పంగా క్షీణించిందని, అయితే మార్కెట్ వాటా 2.4 శాతంగా ఉందని సింఘానియా చెప్పారు. వాణిజ్య వాహన విభాగం వార్షిక ప్రాతిపదికన 124.2 శాతం గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది అని అన్నారు. దీని ప్రస్తుత (జూలైలో) మార్కెట్ వాటా 1.02 శాతంగా ఉంది.
Also Read: Refund Scam: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్..ఈ SMS వచ్చిందా? క్లిక్ చేశారంటే మీ డబ్బులు గోవిందా..!!
కాగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు ప్రోత్సహించడంలో భాగంగా ఈవీ విభాగంలోని వెహికల్స్ కు రాయితీ అందించేందుకు ఇ మొబిలీటి ప్రమోషన్ స్కీమ్ ను తీసుకువచ్చింది. కాగా జులై 30 వరకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ స్కీమును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది. దీని వ్యయాన్ని రూ. 778 కోట్లకు పెంచిన సంగతి తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter