Renault April Offers: కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా... రెనాల్ట్‌లో భారీ ఆఫర్స్...
Renault April Offers: మీరు కొత్త కారు కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారా.. ఏ కారు కొనుగోలు చేయాలా అని ఆలోచిస్తున్నారా... కారుపై భారీ తగ్గింపు కోరుకుంటే రెనాల్ట్ ఇండియా అందిస్తున్న ఆఫర్లపై ఓ లుక్కేయండి.
Renault April Offers 2022: ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ ఇండియా.. కస్టమర్స్ కోసం దాదాపు ప్రతీ నెలా డిస్కౌంట్ ఆఫర్స్‌ను ప్రకటిస్తోంది. ప్రస్తుత ఏప్రిల్ నెలలోనూ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది. తమ కంపెనీ కార్లపై రూ. 55,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకే అందుబాటులో ఉంది. ఏయే కార్లపై ఎంతవరకు డిస్కౌంట్ ఆఫర్ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం...
రెనాల్ట్ క్విడ్ :
రెనాల్ట్ క్విడ్‌పై ఎక్స్‌చేంజ్ బెనిఫిట్ రూ. 10,000 వరకు అందుబాటులో ఉంది. 1.0-లీటర్ మోడల్‌పై రూ. 15,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్, 0.8-లీటర్ మోడల్‌పై రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో కలిపి మొత్తం రూ. 35,000 వరకు బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే స్పెషల్ లాయల్టీ బెనిఫిట్స్ రూ.37 వేల వరకు అందుబాటులో ఉన్నాయి.
రెనాల్ట్ కిగర్ :
Renault India Kygar SUVపై స్పెషల్ లాయల్టీ బెనిఫిట్ కింద రూ. 55,000 వరకు బెనిఫిట్ ఆఫర్ అందుబాటులో ఉంది. అలాగే కార్పోరేట్ డిస్కౌంట్ కింద రూ.10వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఎక్స్‌చేంజ్ బెనిఫిట్స్ ద్వారా స్క్రాప్ రాంపేజ్ కింద రూ.10వేలు వరకు పొందవచ్చు.
రెనాల్ట్ ట్రైబర్
రెనాల్ట్ ట్రైబర్‌పై రూ. 40,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. అలాగే స్పెషల్ లాయల్టీ బెనిఫిట్స్ రూ.44 వేల వరకు, స్క్రాప్ రాంపేజ్ కింద ఎక్స్‌చేంజ్ బెనిఫిట్ రూ.10వేల వరకు పొందవచ్చు. ఇందులో RXE వేరియంట్ మినహా అన్నింటికీ రూ. 10,000 వరకు నగదు తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. 2022 మోడల్‌కు అన్ని వేరియంట్‌లపై డిస్కౌంట్ ఆఫర్ అందిస్తున్నారు.
Also Read: Horseshoe Benefits: ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యాభివృద్ధి కోసం గుర్రపు నాడాతో ఇలా చేయండి!
Also Read: Mumbai Indians: ఐపీఎల్‌లో చెత్త ప్రదర్శన... చెత్త రికార్డును మూటగట్టుకున్న ముంబై..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook