Horseshoe Benefits: జ్యోతిష్య శాస్త్రంలో ఒక్కో లోహానికి ఒక్కో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. బంగారం, వెండి, రాగి, ఇత్తడి, ఇనుము అన్నీ ఒకే గ్రహానికి చెందుతాయి. జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇనుము శనిదేవునికి ఇష్టమైన లోహం. ఇంట్లో శని బాధ నుంచి ఉపశమనం కోసం గుమ్మానికి ఇనుమ లోహాన్ని వేలాడదీస్తే మంచిది. అందులోనూ గుర్రానికి చెందిన నాడాను వేలాడదీస్తే మరింత మంచి జరుగుతుందని జోతిష్య శాస్త్రం చెబుతోంది. అయితే గుర్రపు నాడాను ఇంటి గుమ్మానికి వేలాడదీయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
శని దోషం నుంచి విముక్తి..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఇంటి ప్రధాన ద్వారం మీద గుర్రపు నాడాను వేలాడదీయడం వల్ల ఇంట్లో శుభం కలుగుతుంది. దీనితో పాటు వాస్తు దోషాలు నివారిస్తాయి. అదనంగా.. ఇంట్లో నివసించే వ్యక్తుల జాతకాల్లో శని ప్రభావం ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది.
వ్యాపారంలో విజయం కోసం
కొన్నిసార్లు గుర్రపు నాడాతో తయారు చేసిన ఉంగరాలను చేతికి ఉన్న మధ్య వేలికి ధరించడం శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల చేసే ప్రతి పనిలో విజయం చేకూరుతుందని నమ్మకం. అదనంగా వ్యాపారంలో విజయం సాధించడానికి.. వ్యాపారం చేసే స్థలాల్లో గుర్రపు నాడాను పైన చెప్పిన విధంగా అమర్చాలి. ఇలా చేయడం వల్ల వ్యాపారంలో ఆర్థిక విజయం చేకూరుతుందని నమ్మకం.
ఆర్థిక లాభం కోసం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గుర్రపు నాడా వల్ల ధన లాభం కోసం కూడా ఉపయోగించవచ్చు. ఒక వ్యక్తి సంపదతో మెలగాలంటే గుర్రానికి సంబంధించిన నాడాను పర్సులో పెట్టుకుంటే.. ఆర్థికంగా బలవంతులవుతారని నమ్మకం.
(నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై నివేదించబడింది. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)
Also Read: Hanuman Jayanti 2022: హనుమాన్ జయంతి రోజున ఈ పూజ చేస్తే శని నుంచి విముక్తి తథ్యం!
Also Read: Rahu Ketu Transit: రాహు, కేతువు సంచారం.. ఈ 5 రాశుల వారు పట్టిందల్లా బంగారమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook