Discounts On Renault Kwid, Kiger, Triber Cars: రెనాల్ట్ కార్లకు ఇండియాలో కంటే విదేశాల్లో భారీ క్రేజ్ ఉంటుంది అని చెబుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో రెనాల్ట్ కంపెనీ తమ కార్లను విక్రయించడంలో ప్రసిద్ధికెక్కింది. క్లియో తరహాలో పనితీరుకు తగిన కార్లను తయారు చేయడంలో రెనాల్ట్ కంపెనీకి మంచి పేరుంది. రెనాల్ట్ కంపెనీ దాదాపు దశాబ్దం క్రితమే లాంచ్ చేసిన రెనాల్ట్ డస్టర్‌ కారుకు ఇండియన్ మార్కెట్లో ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది. డస్టర్ కారు తరువాత అదే లైనప్‌లో కైగర్, ట్రైబర్, క్విడ్ పేర్లతో మరో మూడు కార్లు లాంచ్ అయ్యాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతానికి ఈ మూడు మోడళ్ల మీదే ఇండియాలో రెనాల్ట్ కంపెనీ లాభాలు చవిచూస్తోంది. రెనాల్ట్ ఇండియాకు ఉన్న ఏకైక ఆదాయ మార్గాలు కూడా ఈ మోడల్ కార్లు మాత్రమే. అయితే, త్వరలోనే అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి న్యూ జెన్ డస్టర్ ని లాంచ్ చేసేందుకు రెనాల్ట్ ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ కొత్త కారు రాకతో ఇండియాలో తమ రెనాల్ట్ కార్ల విక్రయాలను మరోసారి పెంచుకోవాలని ఆ కంపెనీ భావిస్తోంది.


ఇదిలావుంటే, తాజాగా రెనాల్ట్ ఇండియా తమ కంపెనీ కార్లపై రూ. 64 వేల వరకు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది. ఏయే మోడల్ కారుపై ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు అనేది ఇప్పుడు ఓ స్మాల్ లుక్కేద్దాం రండి.


రెనాల్ట్ క్విడ్ డిస్కౌంట్స్
RDE-కంప్లయింట్ అయిన కొత్త స్టాక్‌పై, రెనాల్ట్ రూ. 57,000 వరకు ఆర్థిక ప్రయోజనాలను అందిస్తోంది. రూ. 15,000 ముందస్తు నగదు ప్రయోజనం కాగా ఎక్స్‌చేంజ్ బోనస్ కింద రూ. 20,000 .. అలాగే కార్పొరేట్ బెనిఫిట్స్ కింద రూ. 12,000 వరకు ఆఫర్స్ అందిస్తున్నట్టు రెనాల్ట్ ప్రకటించింది. ఇంకా, మీరు మీ రెండవ రెనాల్ట్ కారును కొనుగోలు చేస్తే, రూ. 10,000 లాయల్టీ బోనస్ కూడా అందించబడుతుంది. క్విడ్ రెండు ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంది - 0.8L మరియు 1.0L, దీని ధరలు రూ. 4.70 లక్షల నుండి ఎక్స్-షోరూమ్ నుండి ప్రారంభమవుతాయి.


రెనాల్ట్ కైగర్ కారుపై లభిస్తున్న ఆర్థిక ప్రయోజనాలు
రెనాల్ట్ కైగర్ కారుపై లభిస్తున్న ఆర్థిక ప్రయోజనాలు విషయానికొస్తే, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవి కారుపై రూ. 65,000 వరకు బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ కారుపై రూ. 25,000 డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోంది. అయితే, ఈ అవకాశం RXT, RXT(O) వేరియంట్స్‌కి మాత్రమే వర్తిస్తుంది. అంతేకాకుండా, రూ. 20,000 ఎక్స్‌చేంజ్ బోనస్, రూ. 12,000 కార్పొరేట్ డిస్కౌంట్లు, రూ. 10,000 లాయల్టీ బోనస్‌ను పొందవచ్చు. కైగర్ బేసిక్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.50 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది.


ఇది కూడా చదవండి : Maruti Suzuki Jimny Vs Mahindra Thar: ఏ కారుకి ఎంత ధర, ఎన్ని రోజులు వెయిట్ చేయాలి ?


రెనాల్ట్ ట్రైబర్‌పై అందుబాటులో ఉన్న బెనిఫిట్స్
రెనాల్ట్ ట్రైబర్ 7 సీటర్ MPV కారు ఇది. ఈ కారుపై మొత్తం రూ. 45,000 వరకు బెనిఫిట్స్ వర్తించనున్నాయి. ట్రైబర్ కారు కొనుగోలుపై రూ. 15,000 క్యాష్ బెనిఫిట్, అలాగే రూ. 10,000 లాయల్టీ బోనస్, రూ. 20,000 ఎక్స్‌చేంజ్ బోనస్‌ లభిస్తున్నాయి. రెనాల్ట్ ట్రైబర్ కారు బేసిక్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 6.33 లక్షల నుంచి మొదలవుతుంది. అన్నట్టు.. ఇతర కంపెనీ కార్లతో పోల్చుకుంటే.. తక్కువ ధరలో లభించే కార్లలో రెనాల్ట్ కార్లు ముందు వరుసలో ఉంటాయి అనే విషయం తెలిసిందే.


ఇది కూడా చదవండి : Maruti Dzire sedan Price: రూ. 7 లక్షల విలువైన సెడాన్ కారును రూ. లక్ష చెల్లించి ఇంటికి తీసుకెళ్లండి..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK