7 seater car: రూ. 6 లక్షల కంటే తక్కువ ధరకే 7 సీటర్ కార్.. ఫీచర్స్ అదుర్స్
Renault Triber Cheapest 7 Seater Car: మీరు మీ ఫ్యామిలీ మొత్తానికి సరిపోయేలా పెద్ద కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే మీ బడ్జెట్ కేవలం రూ. 6లక్షల లూపే ఉందా. డోంట్ వర్రీ మీకు రూ. 6లక్షలలోపే 7సీటర్ కారు అందబాటులో ఉంది. పూర్తి వివరాలు చూద్దాం.
Renault Triber Cheapest 7 Seater Car: ఇప్పుడు భారత్ లో తక్కువ ధరకే లభించే 7 సీట్ల కార్లకు చాలా డిమాండ్ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కొత్త మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్ దాదాపు రూ. 6 లక్షలు, మీరు మీ బడ్జెట్ లో PV కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, అయితే ఈ కారు గురించి తెలుసుకోండి. ఇది వీకెండ్ పార్టీలకే కూడా ప్రతిరోజూ ఆఫీసులకు వెళ్లేవారికి సైతం కంఫర్ట్ గా ఉంటుంది. అదే రెనాల్ట్ ట్రైబర్ కారు.
ధర, ఫీచర్స్:
ట్రైబర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇందులో 5+2 సీటింగ్ ఆప్షన్ ఉంది. అలాగే, 5 పెద్ద, 2 చిన్న వ్యక్తులు ఇందులో సులభంగా కూర్చోవచ్చు. మీరు దాని బూట్‌లో ఎక్కువ స్థలాన్ని పొందలేరు. ఫీచర్ల గురించి తెలుసుకుంటే..మీరు దాని బూట్‌లో ఎక్కువ స్థలాన్ని పొందలేరు. ఈ కారు 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది Apple Car Play, Android Autoకి కనెక్ట్ చేయగలదు.
Also Read : Simple Business Ideas: ఉన్న ఊరి నుంచి కాలు కదపకుండా.. ఈ బిజినెస్ చేస్తే చాలు నెలకు రూ. 1 లక్ష పక్కా
ఇంజిన్, పవర్:
ట్రైబర్ 999cc పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 72 PS పవర్, 96 Nm టార్క్ తో వస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్, AMT గేర్‌బాక్స్‌తో అమర్చి ఉంటుంది. ట్రైబర్ మైలేజ్ 20 kmpl. భద్రత కోసం, ఇది EBDతో కూడిన ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.
ప్రస్తుతం, మార్కెట్లో 7 సీట్ల కార్ల మోడల్స్ చాలా ఉన్నాయి. అయితే వాటి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాబోయే కొద్ది నెలల్లో మరికొన్ని కొత్త మోడల్స్ రావచ్చు. ప్రస్తుతం, మీ బడ్జెట్ తక్కువగా ఉంటే, మీరు ఐదుగురు పెద్దవాళ్లు, 2 చిన్న పిల్లలు సులభంగా ప్రయాణించగలిగే కారు కోసం చూస్తున్నట్లయితే, ట్రైబర్ మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. మీరు రోజువారీ వినియోగానికి అనువైన అన్ని ముఖ్యమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
Also Read : Car Discounts: కొత్త కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా? ఇదిగో ఈ కార్లు చాలా చీప్‌గా దొరుకుతున్నాయ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.