Car Discounts: కొత్త కారు కొనే ప్లాన్‎లో ఉన్నారా? ఇదిగో ఈ కార్లు చాలా చీప్‎గా దొరుకుతున్నాయ్

Diwali Discounts on Cars: కొత్త  కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నారా. అయితే ఈ వార్త మీకోసమే. ఎందుకంటే ఈనెల సెప్టెంబర్ లో ఫోక్స్ వ్యాగన్ నుంచి హ్యుందాయ్ వరకు ఉన్న కార్లపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి. మీరు కారు కొనాలనుకుంటే ఈ డిస్కౌంట్స్ ను సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఇంతటి భారీ తగ్గింపు మరెప్పుడు వస్తుందో. అంతేకాదు ఈ డిస్కౌంట్స్ కేవలం ఈ నెల మాత్రమే..అంటే ఇంకో వారం రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 
 

1 /6

Diwali Discounts on Cars:  దేశంలో పండుగల సీజన్ షురూ అయ్యింది. మార్కెట్లు ఇప్పటికే భారీ డిస్కౌంట్లు..కళ్లు చెదిరే ఆఫర్లతో సందడిగా మారాయి. అయితే ఈ ఫెస్టివల్ సీజన్ లో ఆటో రంగంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా వెహికల్స్ స్టాక్ క్లియర్ కాలేదు. ఇప్పుడున్న స్టాక్ ను క్లియర్ చేసుకునేందుకు డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి కార్ల కంపెనీలు. అయితే ఇప్పుడు పండుగల సీజన్ మొదలవుతోంది కాబట్టి కార్ల కంపెనీలు కస్టమర్ల కోసం చాలా మంచి ఆఫర్లు, డిస్కౌంట్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ఈ నెల (సెప్టెంబర్), ఫోక్స్‌వ్యాగన్ నుండి హ్యుందాయ్ వరకు కార్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించాయి. ఈ డిస్కౌంట్స్ ను మీరు సద్వినియోగం చేసుకుంటే తక్కువ ధరకే మంచి ఫీచర్లు ఉన్న కారును కొనుగోలు చేయవచ్చు.  ఏ కారుపై ఎంత డిస్కౌంట్ ఉందో తెలుసుకుందాం.   

2 /6

వోక్స్‌వ్యాగన్ వర్టస్:  ఈ నెలలో, మీరు వోక్స్‌వ్యాగన్  సెడాన్ కారు Virtus కొనుగోలు చేయాలనుకున్నట్లయితే.. మీరు ఈ కారుపై రూ. 1.20 లక్షల వరకు డిస్కౌంట్ ను పొందవచ్చు. ఈ తగ్గింపు ఈ నెలకు మాత్రమే వర్తిస్తుంది. మీరు ఈ ఆఫర్‌ను త్వరగా సద్వినియోగం చేసుకోవచ్చు. Virtus ఫీచర్ల గురించి మాట్లాడితే, ఇందులో 1.0, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్లు ఉన్నాయి. ఇది రోజువారీ డ్రైవింగ్‌ను మెరుగుపరచడానికి అవసరమైన ఫీచర్లు అన్నీ ఇందులో ఉన్నాయి.   

3 /6

హోండా సిటీ: హోండా సిటీ ఇప్పటికీ దాని విభాగంలో అత్యుత్తమ సెడాన్ కారుగా గుర్తింపుం పొందింది . ఈ నెలలో మీరు ఈ కారుపై రూ.1.14 లక్షల వరకు డిస్కౌంట్స్ పొందవచ్చు  ఈ కారులో 1.5L పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది కాకుండా హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది. మీరు ఇందులో చాలా మంచి ఫీచర్లను కూడా పొందుతారు. ఈ కారులో 5 మంది సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. హోండా సిటీ నేరుగా హ్యుందాయ్ వెర్నా, స్కోడా స్లావియాలతో పోటీపడనుంది.  

4 /6

హోండా అమేజ్: కాంపాక్ట్ సెడాన్ కార్ సెగ్మెంట్లో హోండా అమేజ్ చాలా మందికి ఇష్టం. ఈ నెలలో ఈ కారును కొనుగోలు చేస్తే , మీరు రూ. 1.12 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశాన్ని పొందుతారు. ఇంజన్ గురించి చెప్పాలంటే, ఈ కారు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ కారు మాన్యువల్ లేదా CVT ఆటోమేటిక్‌తో వస్తుంది. మీరు హోండా అమేజ్‌లో చాలా మంచి ఫీచర్లను కూడా పొందుతారు. ఈ ఏడాది చివరి నాటికి దీని ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేయవచ్చని భావిస్తున్నారు.

5 /6

హ్యుందాయ్ వెర్నా: హ్యుందాయ్ వెర్నా మిడ్-సైజ్ సెడాన్ ఆర్ సెగ్మెంట్‌లో బెస్ట్ కారుగా గుర్తింపు పొందింది. ఈ నెల, ఈ కారుపై మొత్తం రూ. 50,000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. వెర్నా ప్రస్తుతం దాని సెగ్మెంట్‌లో స్టైలిష్,  ఫ్యూచరిస్టిక్ డిజైన్ చేసిన కారు. ఇంజన్ గురించి మాట్లాడుతూ, హ్యుందాయ్ వెర్నా 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ లేదా 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ADAS వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.  

6 /6

హ్యుందాయ్ ఆరా: కాంపాక్ట్ సెడాన్ కార్ల జాబితాలో హ్యుందాయ్ ఆరా అంటే యూత్ చాలా క్రేజ్ ఉంది. ఈ నెలలో మీరు ఈ కారుపై రూ.48,000 వరకు ఆదా చేసుకునే అవకాశాన్ని పొందుతారు. ఈ కారు హోండా అమేజ్,  మారుతి డిజైర్ వంటి కార్లతో పోటీ  పడుతోంది. ఈ ఆఫర్‌లన్నింటి గురించి మరింత సమాచారం కోసం, కార్ డీలర్‌షిప్‌ను సంప్రదించండి.