RBI on Repo Rate: ఆర్బీఐ గుడ్‌న్యూస్ రెపో రేటు యధాతధం, అవే వడ్డీ రేట్లు
RBI on Repo Rate: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి గుడ్‌న్యూస్. వివిధ రకాల లోన్లపై వడ్డీ రేట్లు యధాతధంగా ఉండనున్నాయి. ఆర్బీఐ ఎంపీసీ సమావేశం అనంతరం గవర్నర్ శక్తికాంత దాస్ కీలక విషయాలు వెల్లడించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
RBI on Repo Rate: ఆర్బీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన ద్రవ్య విధాన కమిటీలో తీసుకున్న నిర్ణయాల్ని గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. రెపో రేటులో ఏ విధమైన మార్పు చేయకుండా యధాతథంగా ఉంచుతున్నామని తెలిపారు. ఫలితంగా వడ్డీ రేట్లలో కూడా ఎలాంటి మార్పు ఉండదు. లోన్లపై వడ్డీ రేట్లు పెరుగుతాయని ఆందోళన చెందినవారికి ఇది ఉపశమనంగా ఉంది.
ఆర్బీఐ ఎంపీసీ సమావేశం ఏప్రిల్ 3 నుంచి మూడ్రోజులపాటు జరిగింది. ఇవాళ ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాతం దాస్ వివరించారు. రెపో రేటును యధాతతంగా 6.5 శాతం కొనసాగిస్తున్నామన్నారు. ఆహార ధరల్లో ఏర్పడిన అనిశ్చితి వల్ల ద్రవ్యోల్బణం మరింత పెరగవచ్చని చెప్పారు. ద్రవ్య విధాన కమిటీలోని ఆరుగురిలో ఐదుగురు రెపో రేటు యథాతదంగా కొనసాగించేందుకే అనుకూలంగా ఉన్నారన్నారు. 2025 ఆర్ధిక సంవత్సరంలో జీడీపీ వృద్ది రేటు 7 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో రెండో త్రైమాసికానికి జీడీపీ వృద్ధి రేటు అంచనాను 6.8 శాతం నుంచి 6.9 శాతానికి పెంచామన్నారు.
ద్రవ్యోల్బణంపై ఆర్బీఐ అంచనా ప్రకారం 2025 ఆర్ధిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం అంటే సీపీఐ 4.5 శాతముంటుంది. ఇక ఇదే సంవత్సరంలో 4వ త్రైమాసికంలో సీపీఐ అంచనా 4.7 నుంచి 4.5 శాతానికి తగ్గించింది. రెండవ త్రైమాసికానికి సీపీఐ అంచనాను 4 శాతం నుంచి 3.8 శాతానికి తగ్గించింది. ఇక 1వ త్రైమాసికానికి సీపీఐ అంచనాను 5 శాతం నుంచి 4.9 శాతానికి ఆర్బీఐ తగ్గించింది.
ఇక జీడీపీ వృద్ధిరేటుపై ఆర్బీఐ అంచనాలను పరిశీలిస్తే..2025 మొదటి త్రైమాసికంలో 7.2 నుంచి 7.1 శాతానికి తగ్గవచ్చు. రెండవ త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు అంచనా 6.8 నుంచి 6.9 శాతానికి పెరుగుతుంది. మూడవ త్రైమాసికానికి జీడీపీ వృద్ధి రేటు 7 శాతం ఉండవచ్చు. నాలుగో త్రైమాసికానికి జీడీపీ వృద్ధి రేటు 6.9 శాతం నుంచి 7 శాతానికి పెరిగింది.
Also read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, డీఏతో పాటు ఈ 6 అలవెన్సులు పెంపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook