RBI on 2000 Notes: దేశంలో డీ మోనిటైజేషన్ అమల్లోకి రాగానే 2 వేల నోట్లను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఆ తరువాత కొన్నాళ్లకు 2 వేల రూపాయల నోట్లను రద్దు చేయడమే కాకుండా మార్చుకునేందుకు అవకాశమిచ్చింది. ఇప్పుడా అవకాశం లేదు. కానీ ప్రజల వద్ద ఇంకా 7 వేల కోట్లకు పైగా 2 వేల నోట్లు మిగిలిపోయాయి. మరి ఈ నగదు పరిస్థితి ఏంటి, అలా వృధా అయిపోవల్సిందేనా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2016 నవంబర్ నెలలో డీమోనిటైజేషన్ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ పెద్ద నోట్లను రద్దు చేసింది. అదే సమయంలో 1000, 500 రూపాయల నోట్లను రద్దు చేసింది. కొత్తగా 2 వేల నోట్లను ప్రవేశపెట్టింది. ఆ తరువాత 2023 మే 19 నుంచి 2 వేల నోట్లను ఉపసంహరించుకుంది. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో 2 వేల రూపాయల నోట్లను మార్చుకునేందుకు 2023 అక్టోబర్ 7 వరకు అవకాశమిచ్చింది. అక్టోబర్  9 నుంచి దేశంలోని 19 ఆర్బీఐ కేంద్రాల్లో 2 వేల రూపాయల నోట్లు మార్చుకునేందుకు అవకాశమిచ్చింది. 


ఇప్పుడు తాజాగా 2 వేల రూపాయల నోట్లపై కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకటన ప్రకారం దేశవ్యాప్తంగా 97.96 శాతం 2 వేల రూపాయల నోట్లు బ్యాంకులకు తిరిగి చేరుకున్నాయి. కానీ ఇప్పటికీ 7261 కోట్ల రూపాయలు ప్రజల వద్ద మిగిలే ఉన్నాయి. ఆగస్టు 30న బిజినెస్ ఇయర్ క్లోజింగ్ సందర్భంగా ఆర్బీఐ ఈ ప్రకటన చేసింది. 3.56 లక్షల కోట్ల 2 వేల రూపాయలు చెలామణీలో ఉండగా 2 వేల రూపాయలను రద్దు చేసింది. 


ఆ 7 వేల 261 కోట్ల సంగతేంటి, ఇంకా అవకాశం ఉందా


ప్రజలు ఇప్పటికీ దేశంలోని ఏదో ఒక పోస్టాఫీసు నుంచి 2 వేల రూపాయల నోట్లను ఆర్బీఐకు పంపించి తమ ఎక్కౌంట్లలో డిపాజిట్ చేయించుకునేందుకు అవకాశముంది. దీనికోసం ఆర్బీఐ ప్రాంతీయ కేంద్రాలైనా అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగపూర్, న్యూ ఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంనుంచి 2 వేల రూపాయల నోట్లు మార్చుకోవచ్చు.


Also read: Vijayawada Flood Pics: విలయానికి కేరాఫ్ సింగ్ నగర్, ఇంకా ముంపులోనే బెజవాడ కాలనీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.