Repo Rate: మరోసారి పెరగనున్న రెపోరేటు, మరింత భారం కానున్న ఈఎంఐలు
Repo Rate: ఆర్బీఐ ఇటీవలే రివర్స్ రెపో రేటు పెంచింది. ద్రవ్యోల్బణం తగ్గే సంకేతాలు లేకపోవడంతో మరోసారి రెపోరేటు పెరిగే అవకాశాలున్నాయని ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే ఈఎంఐలు భారంగా మారనున్నాయి.
Repo Rate: ఆర్బీఐ ఇటీవలే రివర్స్ రెపో రేటు పెంచింది. ద్రవ్యోల్బణం తగ్గే సంకేతాలు లేకపోవడంతో మరోసారి రెపోరేటు పెరిగే అవకాశాలున్నాయని ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే ఈఎంఐలు భారంగా మారనున్నాయి.
దేశంలో రెపోరేటు మరోసారి పెరగనుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టకపోవడంతో ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో రెపోరేటు పెంచే నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పటికే అంటే గత నెలలోనే ఆర్బీఐ రెపోపేటును 40 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ సమావేశం ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలో ఈ నెల 6,7 తేదీల్లో జరగనుంది.
ఈ ఏడాది ద్రవ్యోల్బణం 6 శాతానికి పైగా నమోదైంది. ఏప్రిల్ నెలలో అయితే 8 ఏళ్ల గరిష్టస్థాయి.7.79కు చేరుకుంది. అటు దేశీయ వ్యాపారపు ద్రవ్యోల్బణమైతే ఏడాదికి పైగా 15.08గా నమోదవుతోంది. పెరుగుతున్న ఇంధన ధరల్ని నియంత్రించేందుకు కేంద్రం ఇటీవలే పెట్రోల్‌పై 8 రూపాయలు, డీజిల్‌పై 6 రూపాయలు ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించింది. జూన్ 6,7 తేదీల్లో జరగబోయే ఎంపీసీ భేటీలో ద్రవ్యోల్బణం, రెపోరేటు చర్చకు రానుంది. రెపోరేట్లలో కొంత పెరుగుదలైతే ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ దాస్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ నేపధ్యంలో రెపోరేటు ఈసారి 30-35 బేసిస్ పాయింట్ల వరకూ పెంచే అవకాశాలున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook