Holiday List: బ్యాంకింగ్ పనులు జూన్‌లో ఉంటే మాత్రం కాస్త అప్రమత్తమవడం మంచిది. ఎందుకంటే జూన్ నెలలో బ్యాంకింగ్ సెలవులు ఉన్నాయి. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల జాబితా సిద్ధం చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలోని వివిధ బ్యాంకులకు జూన్ నెలలో 8 సెలవులున్నాయి. ఈ సెలవులు ప్రైవేట్, పబ్లిక్ రంగ సంస్థలు రెండింటికీ వర్తిస్తాయి. ఆర్బీఐ ప్రకారం ఈ సెలవుల్లో వారాంతపు సెలవులు కూడా కలిపి ఉన్నాయి. ఆర్బీఐ హాలిడే నోటిఫికేషన్ ప్రకారం ఎనిమిది సెలవులున్నాయి. 


జూన్ నెలకు సంబంధించి సెలవుల జాబితాను ఆర్బీఐ ఇప్పటికే సిద్ధం చేసింది. ఆర్బీఐ సిద్ధం చేసిన బ్యాంకు సెలవుల జాబితాలో పబ్లిక్, ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, ప్రాంతీయ బ్యాంకులు ఉన్నాయి. ఈ సెలవుల్ని మూడు విభాగాలుగా విభజించింది. నెగోషియెబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం, హాలిడే, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే, బ్యాంక్ క్లోజింగ్ డేగా విభజించారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం..దేశంలోని బ్యాంకులు ఈ రోజుల్లో మూసివేసి ఉంటాయి. 


నెగోషియెబుల్ యాక్ట్ ప్రకారం బ్యాంకులకు జూన్ నెలలో రెండే సెలవులున్నాయి. అవి జూన్ 2న మహారాణా ప్రతాప్ జయంతి, జూన్ 11న గురు హర్‌గోవింద్ జయంతి ఉన్నాయి. షిల్లాంగ్‌లో బ్యాంకులు మే 9న మూసివేసుంటాయి


జూన్ 2  మహారాణ ప్రతాప్ జయంతి
జూన్ 15 వైఎంఏ డే లేదా గురు హర్‌గోవింద్ జయంతి
జూన్ 5  ఆదివారం
జూన్ 11 రెండవ శనివారం
జూన్ 12 ఆదివారం
జూన్ 19 ఆదివారం
జూన్ 25 ఆదివారం
జూన్ 26 చివరి శనివారం


జూన్ నెలలో బ్యాంక్ పనులుంటే మాత్రం మీ సంబంధిత బ్యాంకుకు కాంటాక్ట్ చేసి సెలవులు తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ సెలవులు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి.


Also read: Bajaj Chetak eScooter: బజాజ్ చేతక్ గుర్తుందా..ఇప్పుడు సరికొత్త రూపంలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook