August Bank Holidays: ఆగస్టు నెల దాదాపు సగం అయిపోయింది. ఇంకా 18 రోజులు మిగిలున్నాయి. ఈ 18 రోజుల్లో  మీకేమైనా బ్యాంకు పనులుంటే వెంటనే పూర్తి చేసుకోవాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. ఎందుకంటే ఈ 18 రోజుల్లో బ్యాంకు పనిచేసేది కేవలం 8 రోజులే. అంటే ఆగస్టు నెల సెకండ్ హాఫ్‌లో ఎన్ని సెలవులున్నాయో మరి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటి కప్పుడు ప్రతి నెలా బ్యాంకుల సెలవుల్ని ప్రకటిస్తుంటుంది. ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి. ఎందుకంటే కొన్ని ప్రాంతీయ సెలవులుంటే కొన్ని జాతీయ సెలవులుంటాయి. ప్రస్తుతం ఆగస్టు నెలలో ఇంకా 18 రోజులున్నాయి. ఈ 18 రోజుల్లో బ్యాంకు పనులుంటే వెంటనే పూర్తి చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఆగస్టు నెలలో మిగిలిన 18 రోజుల్లో ఏకంగా 10 రోజులు బ్యాంకులు పనిచేయవు. ఆర్బీఐ కూడా కస్టమర్ల సౌలభ్యం దృష్టిలో ఉంచుకుని ముందే బ్యాంకుల సెలవుల్ని విడుదల చేస్తుంటుంది. ఆగస్టు నెల సెలవుల జాబితా కూడా ముందే వచ్చేసింది. ఈసెలవుల్ని బట్టి మీ మీ బ్యాంకు పనుల్ని ప్లాన్ చేసుకోగలరు. 


ఇవాళ ఆగస్టు 13వ తేదీ. అంటే ఈ 13 రోజుల్లో బ్యాంకులు 4 రోజులు పనిచేయలేదు. మిగిలిన నెలలో మరో 10 రోజులు బ్యాంకులు పనిచేయవు. ఇందులో పండుగ, జయంతి, రెండు, నాలుగు శనివారాలు, ఆదివారాలున్నాయి. ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే పురస్కరిచుకుని నేషనల్ హాలిడే ఉంది. ఇది కాకుండా ఓనమ్, రక్షా బంధన్ ఇలా కొన్ని సెలవులున్నాయి. బ్యాంకులు పనిచేయకపోయినా..నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలు చేసుకోవచ్చు. ఏటీఎంలు కూడా పనిచేస్తాయి. బ్యాంకులతో నేరుగా పనుంటే మాత్రం ఇబ్బంది తప్పదు. 


ఆగస్టు 15                                        ఇండిపెండెన్స్ డే
ఆగస్టు 16                                        పార్శీ కొత్త ఏడాది కారణంగా ముంబై, నాగపూర్, బేలాపూర్ ప్రాంతాల్లో సెలవు
ఆగస్టు 18                                        గువహతిలో బ్యాంకు సెలవు
ఆగస్టు 20                                        ఆదివారం సెలవు
ఆగస్టు 26                                        నాలుగవ శనివారం సెలవు
ఆగస్టు 27                                        ఆదివారం సెలవు
ఆగస్టు 28                                         ఓనమ్ కారణంగా కేరళలో సెలవు
ఆగస్టు 29                                         తిరు ఓనమ్ సెలవు
ఆగస్టు 30                                          రాఖీ సెలవు
ఆగస్టు 31                                         నారాయణ గురు జయంతి, రక్షాబంధన్


Also read: Cheaper Home Loan: హోమ్ లోన్ లేదా కార్ లోన్ కోసం చూస్తున్నారా..ఈ బ్యాంకు ట్రై చేయండి తక్కువ వడ్డీ ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitte , Facebook