RBI Clarifies on Missing 500 Rupees Notes: రూ.2 వేల నోటు ఉపసంహరణ తరువాత నోట్ల రద్దుపై మరోసారి చర్చ మొదలైంది. ప్రింటింగ్ ప్రెస్‌లో 500 రూపాయల నోట్లు కూడా మాయమవుతున్నాయంటూ.. ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ విషయంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లారిటీ ఇచ్చింది. 88,032.5 కోట్లు తమ సిస్టమ్ నుంచి తప్పిపోయినట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని స్పష్టం చేసింది. ఆర్‌టీఐ నుంచి అందిన సమాచారాన్ని తప్పుగా అర్థం చేసుకోవడంతో ఇలా జరిగిందని తెలిపింది. దేశంలోని మూడు ప్రింటింగ్ ప్రెస్‌ల నుంచి రూ.500 నోట్ల గురించి ఆర్‌టీఐ కింద ఇచ్చిన సమాచారాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొంది. నోట్ల ప్రింటింగ్ ప్రెస్‌ల ద్వారా ముద్రించిన నోట్లు అదృశ్యమయ్యాయని ఆరోపిస్తూ కొన్ని మీడియాల్లో వార్తలు ప్రసారం అయ్యాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రింటింగ్ ప్రెస్‌ల నుంచి సరఫరా చేసిన అన్ని నోట్లకు సరైన లెక్కలు ఉన్నాయని ఆర్‌బీఐ తెలిపింది. ఉత్పత్తి, నిల్వ, పంపిణీని పర్యవేక్షించడానికి ప్రోటోకాల్‌లతో సహా ప్రెస్‌లలో ముద్రించిన, ఆర్‌బీఐకి సరఫరా చేసిన నోట్లను పునరుద్దరించేందుకు బలమైన వ్యవస్థలు అమలులో ఉన్నాయని పేర్కొంది. ఇలాంటి విషయాలకు సంబంధించి ఫేక్ వార్తలను నమ్మవద్దని ఆర్‌బీఐ ప్రజలను కోరింది. 


సామాజిక కార్యకర్త మనోరంజన్ రాయ్ సమాచార హక్కు కింద ఆర్‌టీఐకి దరఖాస్తు చేసుకోగా.. దానికి సమాధానంగా కొత్త డిజైన్‌తో ఉన్న రూ.500 నోట్లు మాయమయ్యాయని వార్తలు వైరల్ అయ్యాయి. వాటి విలువ రూ.88,032.5 కోట్లు ప్రచారం జరిగింది. దేశంలోని మూడు ప్రింటింగ్ ప్రెస్‌లు కలిసి 8810.65 కోట్ల 500 రూపాయల నోట్లను కొత్త డిజైన్‌తో ముద్రించగా.. రిజర్వ్ బ్యాంక్‌కు వీటిలో 726 కోట్ల నోట్లు మాత్రమే అందాయని.. మొత్తంగా 500 రూపాయల 1760.65 కోట్ల నోట్లు మాయమయ్యాయి ప్రచారం జరిగింది. వాటి విలువ రూ.88,032.5 కోట్లు ఉందని పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి.


Also Read: Adipurush Collections: ఆదిపురుష్ మూవీ టీమ్‌కు షాక్.. అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు క్యాన్సిల్స్


ఈ విషయంపై ఆర్‌బీఐ క్లారిటీ ఇస్తూ.. సిస్టమ్ నుంచి రూ.500 నోట్లు మాయమవుతున్నట్లు వార్తలు సరికాదని పేర్కొంది. ప్రింటింగ్ ప్రెస్ నుంచి వచ్చిన సమాచారం తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపింది. ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రించిన నోట్లు పూర్తిగా భద్రంగా ఉన్నాయని స్పష్టం చేసింది. నోట్ల ఉత్పత్తి, నిల్వ, పంపిణీని ఆర్‌బీఐ పూర్తి ప్రోటోకాల్‌తో పర్యవేక్షిస్తుందని వెల్లడించింది. 


ఆర్‌బీఐ వార్షిక నివేదిక 2022-23 ప్రకారం.. ఈ ఏడాది మార్చి 31 నాటికి మొత్తం సర్క్యులేషన్‌లో చెలామణిలో ఉన్న రూ.2,000, రూ.500 నోట్ల విలువ 87.9 శాతంగా ఉంది. రూ.500 డినామినేషన్ అత్యధిక వాటా 37.9 శాతంగా ఉంది. రూ.10 డినామినేషన్ బ్యాంక్ నోట్లు మార్చి 31 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం నోట్లలో 19.2 శాతంగా ఉన్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. 


Also Read: Pawan Kalyan Speech: సీఎం కావడానికి నేను సంసిద్ధం.. తల తెగినా మాటకు కట్టుబడి ఉంటా: పవన్ కళ్యాణ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook