Review on GST: జీఎస్టీ వ్యవస్థపై మరోసారి సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రాల ప్రాతినిధ్యంతో రెండు కీలకమైన కమిటీల్ని నియమించింది. జీఎస్టీ పరిధిలోని అంశాలపై రివ్యూతో పాటు పెట్రోలియం ఉత్పత్తుల్ని చేర్చే విషయం చర్చకు రానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ప్రభుత్వం(Central government)ప్రవేశపెట్టిన వస్తు సేవల పన్ను జీఎస్టీ వ్యవస్థపై సమీక్ష కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ప్రాతినిధ్యంతో రెండు కీలకమైన కమిటీల్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీల ఆధ్వర్యంలో జీఎస్టీపై సమీక్ష జరగనుంది. ఓ కమిటీకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై(Basavaraja Bommai)నేతృత్వం వహిస్తే..మరో కమిటీ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సారధ్యం వహించనున్నారు. జీఎస్టీ సమీక్షలో రేట్ స్లాబ్‌లు, విలీనం, జీఎస్టీ మినహాయింపు వస్తువులు, పన్ను ఎగవేతల గుర్తింపు, నివారించే మార్గాలు, ట్యాక్స్‌బేస్ వంటి కీలకమైన అంశాలు చర్చకు రానున్నాయి. 2017 జూలైలో జీఎస్టీ విధానం ప్రారంభమైనప్పటి నుంచి వ్యవస్థను ఎప్పటికప్పుడు సరళీకృతం చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. 


జీఎస్‌టీ వ్యవస్థ ప్రవేశపెట్టిన తరువాత పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం, సహజ వాయువు, క్రూడ్‌ ఆయిల్‌ను ఈ విధానం నుంచి మినహాయించారు. పెట్రో ఉత్పత్తులపై కేంద్రం ఎక్సైజ్‌ సుంకం, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను కొనసాగించడానికి ఈ విధానం దోహదపడుతోంది. పెట్రో ఉత్పత్తులను జీఎస్‌టీ(GST) పరిధిలోనికి తీసుకుని రావాలన్న డిమాండ్‌ ఉన్నప్పటికీ, ఇటీవల జరిగిన అత్యున్నత స్థాయి విధాయక మండలి అసలు ఆ అంశంపైనే చర్చించకూడదని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. కాబట్టి జీఎస్టీ సమీక్షలో (GST Review)పెట్రోలియం ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలో చేర్చే అంశమే ప్రస్తావనకు రాదు. 


కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కమిటీ రెండు నెలల్లో నివేదిక సమర్పించనుంది. పశ్చిమ బెంగాల్ ఆర్ధికమంత్రి అమిత్ మిశ్రా, కేరళ ఆర్ధిక మంత్రి కేఎన్ బాలగోపాలన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తార్ కిషోర్ ప్రసాద్ తదితరులు సభ్యులుగా ఉంటారు. ఇక మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని కమిటిలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తమిళనాడు ఆర్ధికమంత్రి పళనివేల్ త్యాగరాజన్, ఛత్తీస్‌గఢ్ ఆర్ధిక మంత్రి టీఎస్ సింగ్ డియో ఉన్నారు. ఈ నెల 17వ తేదీన కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman)నేతృత్వంలో లక్నోలో జీఎస్టీ కమీషన్ కమిటీలను ఏర్పాటు చేసింది.


ప్రస్తుతం దేశంలో నాలుగు జీఎస్టీ రేట్ల వ్యవస్థ అమల్లోఉంది. నిత్యావసరాలపై కనిష్టంగా 5 శాతం పన్ను ఉంది. కార్లపై అత్యధికంగా 28 శాతం పన్ను విధించారు. అటు లగ్జరీ, పొగాకు వంటివాటిపై 29 శాతం సెస్ అమలవుతోంది. 12, 18 శాతం శ్లాబ్ లను ఒకటి చేయాలనే డిమాండ్ గత కొద్దికాలంగా విన్పిస్తోంది. ఇక జీఎస్టీ పరిధి నుంచి ఏయే ఇతర అంశాల్ని ఎందులో చేర్చాలి, ఎందులోంచి మినహాయింపు ఇవ్వాలనే విషయంపై రెండు కమిటీల నివేదికపై ఆధారపడి కేంద్రం తుది నిర్ణయం తీసుకోనుంది. 


Also read: Flipkart Big Billion Days: 'ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీల్లో మార్పు..ఆ వివరాలివే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook