New Rules From August: జూలై నెల ముగియడానికి మరో నాలుగు రోజుల సమయం ఉంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఐటీఆర్ ఫైలింగ్, క్రెడిట్ కార్డ్‌కు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆగస్టు నెల ప్రారంభిం నుంచి అనేక నిబంధనలు మారనున్నాయి. అదేవిధంగా ఆగస్టు నెలలో బ్యాంకులకు 14 రోజులు సెలవులు ఉంటాయి. రక్షా బంధన్, మొహర్రం, అనేక ఇతర పండుగల కారణంగా వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్ కానున్నాయి. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి చేసుకోవాల్సిన పనులు ఏమైనా ఉంటే.. ముందే పూర్తి చేసుకోవడం మంచిది. వచ్చే నెల నుంచి మార్పులు జరిగే వాటిపై ఓ లుక్కేయండి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్యాస్‌ ధరల్లో మార్పు..


ఆగస్టు నెల నుంచి గ్యాస్ సిలిండర్ ధరలో మార్పు ఉండే అవకాశం ఉంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు, వాణిజ్య సిలిండర్ల ధరలను మార్చవచ్చు. ఈ కంపెనీలు ప్రతినెలా 1వ తేదీ, 16వ తేదీల్లో ఎల్‌పీజీ ధరను మారుస్తాయి. పీఎన్‌జీ, సీఎన్‌జీ రేటులో కూడా మార్పు ఉండవచ్చు.


ఐటీఆర్ ఫైలింగ్..


ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31. ఈ తేదీలోపు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే.. జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ట్యాక్స్‌తోపాటు ఫైన్‌ కూడా కట్టాల్సి ఉంటుంది. ఆలస్యంగా ఐటీఆర్ ఫైల్ చేసినందుకు పన్ను చెల్లింపుదారులు రూ.5 వేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 


యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు


యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఫ్లిప్ కార్డులో షాపింగ్ చేస్తే.. ఆఫర్లు తగ్గనున్నాయి. క్యాష్‌ బ్యాక్‌తోపాటు తగ్గించడంతోపాటు రివార్డు పాయింట్లు కూడా తగ్గించింది. ఆగస్ట్ 12వ తేదీ నుంచి నిబంధనలు మారనున్నాయి. 


ఎస్‌బీఐ అమృత్ కలాష్
 
ఎస్‌బీఐ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ అమృత్ కలాష్‌లో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ ఆగస్టు 15. ఇది 400 రోజుల టర్మ్ డిపాజిట్ పథకం. వడ్డీ రేటు సాధారణ కస్టమర్లకు 7.1 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.6 శాతంగా ఉంటుంది. ఈ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ కింద ముందస్తు ఉపసంహరణ, లోన్ సదుపాయం కూడా ఉంటుంది.


ఐడీఎఫ్‌సీ బ్యాంక్ ఎఫ్‌డీ


ఐడీఎఫ్‌సీ బ్యాంక్ అమృత్ మహోత్సవ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ను 375 రోజులు, 444 రోజులకు ప్రారంభించింది. ఇందులో ఇన్వెస్ట్ చేసేందుకు చివరి తేదీ ఆగస్టు 15. 375 రోజుల ఎఫ్‌డీపై గరిష్ట వడ్డీ 7.60 శాతం. 444 రోజుల FDపై గరిష్ట వడ్డీ 7.75 శాతం.  300 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఉంది. దీని కింద 5 వేల నుంచి 2 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ ఆగస్ట్ 31. సామాన్యులకు 7.05 శాతం కాగా.. సీనియర్‌ సిటిజన్‌లకు 7.55 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.


Also Read: Telangana Rain Updates: అర్ధరాత్రి అభయారణ్యంలో 80 మంది పర్యాటకులు.. ఒక్క ఫోన్‌ కాల్‌తో..!  


Also Read: IND vs WI 1st ODI: విండీస్ తో తొలి వన్డే నేడే.. తుది జట్టులో ఉండేది ఎవరు?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook