Best Safety Cars in India: కొత్తగా కారు కొనేవారు తాము కొనబోయే కార్లలో క్షుణ్ణంగా పరిశీలించే అంశాల్లో ముందుండే అంశం ఆ కారు ఎంత సేఫ్ అనేదే. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ తో వచ్చే కారు కావాలని ఎలాగైతే వెతుకుతారో.. అలాగే తక్కువ ధరలో ఎక్కువ సేఫ్టీ ఉన్న కారు కావాలని కూడా అంతే వెతుకుతారు. అలా అత్యధిక భద్రతను అందించే కార్లలో టాటా మోటార్స్ కంపెనీకి చెందిన కార్లు ఎక్కువగా ఉండగా ఆ తరువాతి స్థానంలో మహింద్రా అండ్ మహింద్రా, వోక్స్‌వ్యాగాన్ కార్లు కార్లు ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వోక్స్‌వ్యాగాన్ వర్చస్ : 
వోక్స్‌వ్యాగాన్ వర్చస్ కారు అడల్ట్స్ రేటింగ్స్, చైల్డ్ సేఫ్టీ రేటింగ్స్‌లో 5 స్టార్ సొంతం చేసుకుంది. కాంపాక్ట్ సెడాన్ కార్లలో 5 స్టార్ రేటింగ్ ఉన్న అతి కొద్ది కార్లలో ఇది కూడా ఒకటి. 2022 మార్చిలో ఈ కారు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. 


స్కోడా స్లేవియా : 
2022 ఫిబ్రవరి నుంచి ఇండియన్ కస్టమర్స్‌కి అందుబాటులోకి వచ్చిన స్కోడా స్లేవియా సెడాన్ కారు సైతం సేఫ్టీ రేటింగ్స్‌లో 5 ఔట్ ఆఫ్ 5 స్టార్స్ సొంతం చేసుకుంది. అడల్ట్స్ సేఫ్టీ, చైల్డ్ సేఫ్టీ.. రెండింటిలోనూ స్కోడా స్లేవియా 5 స్టార్ మార్క్స్ దక్కించుకుంది.    


స్కోడా కుశాఖ్ కారు :
స్కోడా కుశాఖ్ కారుకు గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టింగ్ రేటింగ్స్‌లో అడల్ట్స్ సేఫ్టీ రేటింగ్స్‌లో 5/5 , చైల్డ్ సేఫ్టీ రేటింగ్స్‌లో 5/5 రేటింగ్ వచ్చింది. 


టాటా పంచ్ కారు :
టాటా మోటార్స్ కంపెనీ రెండేళ్ల కిందట మార్కెట్లోకి విడుదల చేసిన టాటా పంచ్ కాంపాక్ట్ SUV కారు అనతికాలంలోనే భారీ సంఖ్యలో కస్టమర్స్ మనసు చూరగొంది. లాంచ్ అయిన తరువాత కొద్ది రోజుల్లోనే లక్షకుపైగా కార్లు అమ్ముడు పోయ్యాయి. గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో టాటా పంచ్ కారుకు అడల్ట్స్ సేఫ్టీ రేటింగ్ లో 5/5 , చైల్డ్ సేఫ్టీ రేటింగ్‌లో 4/5 రేటింగ్ లభించింది. 


టాటా ఆల్ట్రోజ్ కారు :
టాటా ఆల్ట్రోజ్ కారు 2018 ఆటో-ఎక్స్‌పోలో ద్వారా తొలిసారిగా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ కారుకు అడల్ట్స్ సేఫ్టీ రేటింగ్ లో 5/5 , చైల్డ్ సేఫ్టీ రేటింగ్స్ లో 3/5 లభించింది. 


టాటా నెక్సాన్ కారు :
మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న SUV కార్లలో టాటా నెక్సాన్ కారు ముందు వరుసలో ఉంది. పెట్రోల్, డీజిల్ వేరియంట్స్ తో పాటు ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా లాంచ్ అవడం ఈ కారుకు మరో ప్లస్ పాయింట్. ఇక టాటా నెక్సాన్ సేఫ్టీ రేటింగ్స్ విషయానికొస్తే.. అడల్ట్స్ రేటింగ్స్‌లో 5/5 రేటింగ్ సొంతం చేసుకోగా.. చైల్డ్ సేఫ్టీ రేటింగ్స్ విషయానికొస్తే.. టాటా నెక్సాన్ కారు 3/5 రేటింగ్స్ కైవసం చేసుకుంది. 


ఇది కూడా చదవండి : Important Last Dates in September: ఈ నెలలో చేయాల్సిన ముఖ్యమైన పనులు.. లాస్ట్ డేట్స్


మహింద్రా XUV 300 కారు :
మహింద్రా అండ్ మహింద్రా తయారుచేసిన మహింద్రా XUV 300 కారు 2019 లో తొలిసారిగా ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయింది. గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ రేటింగ్స్‌లో వరుసగా మూడేళ్లపాటు టాప్ రేటింగ్స్ సొంతం చేసుకున్న అతి కొద్ది వాహనాల్లో మహింద్రా XUV 300 కారు కూడా ఒకటి. అడల్ట్స్ సేఫ్టీ రేటింగ్స్‌లో మహింద్రా XUV 300 కారు 5/5 , చైల్డ్ సేఫ్టీ రేటింగ్‌లో 3/5 రేటింగ్ సొంతం చేసుకుంది. 


ఇది కూడా చదవండి : Honda Elevate SUV: హోండా నుండి కతర్నాక్ ఎలివేట్ SUV కారు వచ్చేసింది..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.