Samsung galax A53 5g: గెలాక్సీ నుంచి మరో అద్భుతమైన 5జీ ఫోన్ వస్తోంది. దేశంలో 5జీ సేవలు ప్రారంభంకాక ముందే మొబైల్ తయారీ కంపెనీలు వీటిపై దృష్టి పెట్టాయి. ప్రత్యేకమైన మోడల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. తాజాగా శాంసంగ్ కంపెనీ 'ఏ' సిరీస్‌లో మరో కొత్త 5జీ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఏ53 5జీ పేరుతో ఈ ఫోన్‌ వస్తోంది. 5జీ ఫోన్‌లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయని తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శాంసంగ్ 5జీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో చూద్దాం..
ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ 4.1 ఓఎస్‌తో 5జీ ఫోన్‌ పనిచేస్తుంది. 120 హెర్జ్ రిఫ్రెష్‌ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్ హెడ్‌డీ ప్లస్ డిస్‌ప్లే సూపర్ అమోలెడ్ ఇన్ఫీనిటీ డిస్‌ ప్లే ఉండనుంది. ఆక్టాకోర్ ఎక్సినోస్ 1280 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు.


గెలాక్సీ ఏ53 5జీలో మొత్తం ఐదు కెమెరాలున్నాయి. వెనుక నాలుగు, ముందు ఓ కెమెరా ఉంది. వెనుక వైపు 64 ఎంపీ పైమరీ కెమెరాతోపాటు 12ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్, రెండు 5 ఎంపీ కెమెరాలు ఈ 5జీ ఫోన్‌లో ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32 ఎంపీ కెమెరా అమర్చారు. 5 వేల ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌గా ఉంటుంది. 


శాంసంగ్‌ గెలాక్సీ 5జీ ఫోన్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 6 జీబీ ర్యామ్..128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర 34 వేల 499గా ఉంది. 8 జీబీ..128 జీబీ ధర 35 వేల 999గా నిర్ణయించారు. మార్చి 25 నుంచి విక్రయాలు మొదలుకానున్నాయి. ఈనెల 21 నుంచి 31 తేదీ వరకు ముందస్తు బుకింగ్‌ చేసుకునే అవకాశం ఉంది. ఈమేరకు శాంసంగ్‌ ఓ ప్రకటనలో తెలిపింది. 


Also read: China Plane Crash: బ్రేకింగ్ న్యూస్.. చైనా ఘోర విమాన ప్రమాదం.. 133 మంది ప్రయాణికులు మృతి?


Also read: RRR: ఇండియన్ సినీ హిస్టరీలో 'ఆర్ఆర్ఆర్' సంచలనం కాబోతుందా.. వసూళ్ల పరంగా పాత రికార్డులన్నీ బద్దలవుతాయా..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook