Samsung Galaxy F02s price and specifications: తక్కువ ధరలో మంచి స్మార్ట్ ఫోన్ కోసం వేచిచూస్తున్న వారికి దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ గుడ్ న్యూస్ చెప్పింది. శాంసంగ్ నుంచి మరో కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వచ్చింది. రూ. 9 వేల లోపు ధరలోనే ఎక్కువ కెపాసిటీ ఉన్న బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే, ఎక్కువ స్టోరేజీ, వెనకాల ట్రిపుల్ కెమెరాతోపాటు మరిన్ని ఆకట్టుకునే ఇతర ఫీచర్స్‌తో శాంసంగ్ గెలాక్సీ F02s (Samsung Galaxy F02s) పేరుతో శాంసంగ్ ఈ స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఆ ఫోన్ విశేషాలేంటో ఇప్పుడు ఓ లుక్కేద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏప్రిల్ 9న.. అంటే ఇవాళే ఇండియన్ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియెంట్స్‌లో లభిస్తుంది.


అందులో ఒకటి 4GB RAM + 64GB internal storage వేరియంట్ కాగా.. మరొకటి 3GB RAM + 32 GB internal storage వేరియెంట్.


పవర్‌ఫుల్ క్వాల్‌కామ్ ప్రాసెసర్‌తో రూపొందిన ఈ శాంసంగ్ గెలాక్సీ F02s స్మార్ట్ ఫోన్‌కి 6.5 అంగుళాల HD+ display, 5000mAh battery ని అమర్చారు.


4GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999 గా ఉండగా.. 3GB RAM + 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.8,999 గా ఉంది.


డైమండ్ కట్ డిజైన్‌తో డైమండ్ వైట్, డైమండ్ బ్లూ, డైమండ్ బ్లాక్ కలర్స్‌లో శాంసంగ్ గెలాక్సీ F02s (Samsung Galaxy F02s) లభిస్తోంది. 


Also read : Vakeel Saab Movie Review, Highlights and Rating in Telugu: వకీల్ సాబ్ మూవీ రివ్యూ, రేటింగ్, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్, హైలైట్స్


నేటి నుంచి శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌లో (Samsung Online Store, Flipkart.com) విక్రయానికి అందుబాటులో ఉన్నట్టు శాంసంగ్ ప్రకటించింది. 


5000mAh బ్యాటరీ ఉండటంతో పదేపదే చార్జింగ్ పెట్టాల్సిన పని లేకుండా రోజు మొత్తం నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్మెంట్ ఎంజాయ్ చేయొచ్చని శాంసంగ్ చెబుతోంది. 


కెమెరా విషయానికొస్తే... వెనక భాగంలో 13MP మెయిన్ కెమెరా, ఎక్స్‌ట్రీమ్ క్లోజప్ షాట్స్ కోసం 2MP మ్యాక్రో కెమెరా, పోర్ట్రెయిట్ షాట్స్ కోసం 2MP డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 5MP Selfie camera ను అమర్చారు. 


Qualcomm Snapdragon 450 processor ఆధారంగా పనిచేసే స్మార్ట్ ఫోన్ కావడంతో మల్టీటాస్కింగ్, గేమింగ్, యాప్ నావిగేషన్‌కి ఇబ్బంది లేకుండా పనిచేయనుందని శాంసంగ్ పేర్కొంది.


Also read : Cheap and best smartphones: తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ కలిగిన చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook