Samsung Galaxy F23 5G Discount Offer in Flipkart: ఇండియన్ మొబైల్ మార్కెట్లో 5G స్మార్ట్‌ఫోన్స్ ఎప్పుడో సర్వసాధారణం అయ్యాయి. ఇండియాలో 5G నెట్‌వర్క్ లాంచ్ కాకముందే 5G స్మార్ట్‌ఫోన్స్‌కి భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో స్మార్ట్‌ఫోన్ మేకర్స్ సైతం రెండేళ్ల ముందు నుంచే కొత్తగా లాంచ్ చేసే మొబైల్ మోడల్స్‌ని 5G నెట్‌వర్క్‌కి అనుగుణంగా తయారు చేసి లాంచ్ చేయడం మొదలుపెట్టారు. అలా దేశంలో 5G నెట్‌వర్క్‌కి కంటే ముందుగా 5G స్మార్ట్ ఫోన్స్ పరిచయం అయ్యాయి. అలాంటిది ఇటీవల దేశంలో 5G నెట్‌వర్క్ కూడా లాంచ్ అయింది. దేశంలో అతి పెద్ద నెట్‌వర్క్ కలిగిన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ వంటి టెలికాం ఆపరేటర్స్ పోటాపోటీగా 5G నెట్‌వర్క్ లాంచ్ చేశాయి. దీంతో 5G స్మార్ట్‌ఫోన్స్‌కి డిమాండ్ ఇంకా రెట్టింపయ్యింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5G నెట్‌వర్క్ రాకతో స్మార్ట్‌ఫోన్ యూజర్స్ దృష్టి ఇప్పుడు 5G స్మార్ట్‌ఫోన్స్‌పై పడింది. ఫలితంగా 5G స్మార్ట్‌ఫోన్స్ మేకర్స్ 5G మోడల్స్‌పై భారీ ఆఫర్స్ ప్రకటిస్తున్నారు. అలా శాంసంగ్ ప్రకటించిన తాజా ఆఫర్ 5G స్మార్ట్ ఫోన్స్ కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. 


శాంసంగ్ గెలాక్సీ F23 5G స్మార్ట్ ఫోన్‌ అసలు ధర 23,999 రూపాయలు కాగా ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 29% డిస్కౌంట్‌కి.. అంటే 16,999 రూపాయలకే ఈ ఫోన్ లభిస్తోందన్న మాట. పైగా ఎలాంటి డెలివరీ చార్జీలు లేకుండా ఫ్రీ డెలివరి పొందొచ్చు. అంతేకాదండోయ్.. నెలకు కనీసం రూ. 2834 మాత్రమే నెలవారీ ఇఎంఐగా చెల్లించి కూడా ఈ ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు. 6 నెలలపాటు వాయిదా పద్ధతిలో ఇఎంఐలు చెల్లించుకుంటూ 5G స్మార్ట్‌ఫోన్‌‌ని మీ సొంతం చేసుకోవచ్చు. 


శాంసంగ్ F23 5G స్మార్ట్ ఫోన్ ఫీచర్స్..
శాంసంగ్ F23 5G ఫోన్ 5G నెట్‌వర్క్ కనెక్టివిటీకి అనుకూలంగా ఉండటంతో పాటు పర్‌ఫార్మెన్స్ కోసం 6GB RAM ఉంది. మొబైల్ ఇంటర్నల్ స్టోరేజీ కోసం 128GB ఇంటర్నల్ మెమొరి కూడా ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగాన్ 750G ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌కి వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అమర్చారు. మెయిన్ కెమెరా 50MP కాగా రెండో కెమెరా 8MP, మూడో కెమెరా 2MP లెన్స్ కలిగి ఉన్నాయి. అందమైన సెల్ఫీల కోసం ముందు భాగంలో 8MP ఫ్రంట్ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ కి ఉన్న మరో ప్లస్ పాయింట్ ఏంటంటే.. బ్యాటరీ పరమైన ఇబ్బందులు లేకుండా 5000 mAh భారీ బ్యాటరీ కలిగి ఉంది. 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డి + డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 4G, 3G అలాగే 2G నెట్‌వర్క్ కనెక్టివిటీకి కూడా అనుకూలంగా ఉంటుంది. 


శాంసంగ్ F23 5G స్మార్ట్ ఫోన్ లో మీరు డ్యూయల్ సిమ్ కార్డ్‌లను ఉపయోగించవచ్చు. కొనుగోలు చేసిన తేదీ నాటి నుంచి ఒక సంవత్సరం పాటు వారంటీ ఉంది. ఇందులో 6GB RAM ని 12GB RAM వరకు ఎక్స్ పాండ్ చేసుకోవచ్చు. దీనికి ఒక సంవత్సరం వారంటీ ఉంది. అలాగే ఈ ఫోన్ లో ఉన్న వాయిస్ ఫోకస్ ఫీచర్ ఏదైనా బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ని తొలగించడానికి మీకు సహాయపడుతుంది. ఇందులో పవర్ కూల్ టెక్నాలజీ కూడా ఉంది.


Also Read : Reliance Jio: దేశంలో అత్యంత బలమైన టెలికాం బ్రాండ్‌గా 'రిలయన్స్‌ జియో'..


Also Read : Airtel 199 Plan: ఎయిర్‌టెల్ గుడ్‌న్యూస్, 199 రూపాయలకే అన్‌లిమిటెడ్ కాల్స్‌తో ప్రీపెయిడ్ ప్లాన్


Also Read : Car Loans Interest Rates: కారు కొనాలనుకుంటున్నారా ? ఐతే ఈ డీటేల్స్ మీ కోసమే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook