Car Loans Interest Rates: కారు కొనాలనుకుంటున్నారా ? ఐతే ఈ డీటేల్స్ మీ కోసమే

Car Loans Interest Rates: కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? మార్కెట్లో లాంచ్ అవుతున్న కొత్త కార్లపై మనసు పడ్డారా ? ఇప్పుడున్న కారు పాతది అయ్యింది కదా అని కొత్త కారు తీసుకునే యోచనలో ఉన్నారా ? ఇలాంటి ప్రశ్నల్లో ఏ ఒక్క ప్రశ్నకు మీ సమాధానం యస్ అయినా.. ఇదిగో ఈ న్యూస్ మీ కోసమే. మరి ఇంకెందుకు ఆలస్యం.. పూర్తిగా చదివేయండి.

Written by - Pavan | Last Updated : Nov 11, 2022, 06:16 PM IST
  • కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా ?
  • ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ రేటుకు కారు లోన్ లభిస్తుందో తెలుసా ?
  • వివిధ బ్యాంకులు అందిస్తున్న కారు లోన్స్ వడ్డీ రేట్లపై ఫుల్ డీటేల్స్
Car Loans Interest Rates: కారు కొనాలనుకుంటున్నారా ? ఐతే ఈ డీటేల్స్ మీ కోసమే

Car Loans Interest Rates: కొత్త కారు కొనేందుకు సమయం ఆసన్నమైంది అనుకునే వారు ముందుగా చెక్ చేసే అంశం ఏంటి ? ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ రేటుకు కారు లోన్ లభిస్తుందా అనే అంశాన్ని పరిశీలిస్తారు కదా.. అందుకే ఏయే బ్యాంకు ఎంత శాతం వడ్డీ రేటు ఛార్జ్ చేస్తున్నాయనే వివరాలపై ఓ స్మాల్ లుక్కేద్దాం రండి.

ఎస్బీఐలో కారు లోన్స్ వడ్డీ రేట్లు
కారు కొనుగోలు చేసే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.20 శాతం వడ్డీ రేటుకే కారు లోన్ అందిస్తోంది. అది కూడా ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండానే. వచ్చే ఏడాది.. అంటే 2023 జనవరి 31 వ తేదీ వరకు ఈ కారు లోన్ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఎస్బీఐ స్పష్టంచేసింది.

హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంకులో కారు లోన్స్ వడ్డీ రేట్లు
ఇక వెహికిల్ లోన్స్ అందించడంలో ఎప్పుడూ ముందుండే హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్ ప్రస్తుతం 7.95 శాతం వడ్డీ రేటుకు కారు లోన్ ఆఫర్ చేస్తోంది. 

పంజాబ్ నేషనల్ బ్యాంకులో కారు లోన్స్ వడ్డీ రేట్లు
నిరవ్ మోదీ దెబ్బకు భారీ కుంభకోణంతో కుదేలై మళ్లీ కోలుకుంటున్న పంజాబ్ నేషనల్ బ్యాంకు సైతం తక్కువ వడ్డీ రేటుకే కారు లోన్స్ అందిస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో 6.65 శాతం వడ్డీకే కారు లోన్ పొందొచ్చు. 

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కారు లోన్స్ వడ్డీ రేట్లు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విషయానికొస్తే.. 7.40 శాతం వడ్డీ రేటుతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కారు లోన్స్ అందిస్తోంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా కారు లోన్స్ వడ్డీ రేట్లు
బ్యాంక్ ఆఫ్ బరోడా 7 శాతం వడ్డీ రేటుకే కారు లోన్స్ అందిస్తున్నప్పటికీ.. అదనంగా 1500 ప్రాసెసింగ్ ఫీజు ఛార్జ్ చేస్తోంది. 

యాక్సిస్ బ్యాంక్ కారు లోన్స్ వడ్డీ రేట్లు
యాక్సిస్ బ్యాంకులో కారు లోన్ల విషయానికొస్తే.. కారు లోన్ వడ్డీ రేటు 7.45 శాతంగానే ఉన్నప్పటికీ ఇక్కడ కొంత ప్రాసెసింగ్ ఫీజు అధికంగా ఉంది. కనీసం రూ. 3,500 నుంచి 7 వేల వరకు ప్రాసెసిసంగ్ ఫీజు ఛార్జ్ చేస్తున్నారు. 

బ్యాంక్ ఆఫ్ ఇండియా కారు లోన్ల వడ్డీ రేట్లు..
బ్యాంక్ ఆఫ్ ఇండియా కారు లోన్లపై అత్యధికంగా 8.30 వడ్డీ రేటు ఛార్జ్ చేస్తోంది. ఇప్పటివరకు చెప్పుకున్న బ్యాంకుల్లో ఇదే అత్యధిక వడ్డీ రేటు. ప్రతీ లక్ష రూపాయలకు కనీసం రూ. 1,574 EMI గా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది చివరి వరకు.. అంటే 2022 డిసెంబర్ 31వ తేదీ వరకు బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే కారు లోన్లపై ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. స్టార్ వెహికల్ లోన్ స్కీమ్ పేరుతో బ్యాంక్ ఆఫ్ ఇండియా కారు లోన్స్ అందిస్తోంది. 

ఎలక్రిక్ కార్లను ప్రోత్సహించేందుకు..
ఎలక్రిక్ కార్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గాను బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్రిక్ కార్ల కొనుగోలుపై మరో సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. ఎలక్రిక్ వాహనాలపై ఆన్‌రోడ్ ప్రైస్‌కి సమానంగా 100 శాతం కారు లోన్ మంజూరు చేయనున్నట్టు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అంటే ఎలక్రిక్ కారు కొనేవారికి డౌన్ పేమెంట్‌తో సంబంధం లేకుండా 100 శాతం కారు లోన్ లభించనుందన్నమాట.

Also Read : Business Ideas: 2 నెలల కోర్సు చేసి ఏడాదికి 18 లక్షలు సంపాదిస్తున్నాడు

Also Read : SBI Custmoers Alert: ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక.. మీకూ ఇలాంటి మెసేజెస్ వస్తున్నాయా ?

Also Read : Viral Snakes Video: స్కూటీలో దాక్కున్న నాగుపాము.. స్కూటీలు నడిపే వాళ్ల గుండె గుభేల్మనే వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News