Samsung Galaxy S23 Ultra Price Cut Alert: శాంసంగ్ ఇటీవలే లాంచ్ చేసిన గెలాక్సీ ఎస్23 సిరీస్‌కి స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో భారీ క్రేజ్ కనపడుతోంది. ఇప్పటికే మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S23, శాంసంగ్ గెలాక్సీ S23 ప్లస్  స్మార్ట్ ఫోన్స్‌కి మంచి ఆధరణ కనిపిస్తుండగా తాజాగా ఇదే సిరీస్‌లో శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఫిబ్రవరి 17 నుంచి ఈ స్మార్ట్ ఫోన్స్ షిప్పింగ్ ప్రారంభం కానున్నట్టు సౌత్ కొరియన్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం కంపెనీ శాంసంగ్ స్పష్టంచేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా ధరపై రూ. 8 వేల వరకు భారీ డిస్కౌంట్ అందిస్తున్నట్టు శాంసంగ్ ప్రకటించింది. హెచ్‌డిఎఫ్‌సి, ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంకుల క్రెడిట్ కార్డులు ఉపయోగించే వారు శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా స్మార్ట్ ఫోన్‌పై రూ. 8 వేల డిస్కౌంట్ ఆఫర్ అందుకోవచ్చు. 


మిగతా అన్ని ఫ్లాగ్‌షిప్ ఫోన్స్ కంటే శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ భిన్నమైన క్రేజ్ సొంతం చేసుకోవడానికి కారణం ఈ ఫోన్‌లో ఉన్న ఎన్నో లేటెస్ట్ ఫీచర్స్. 6.8 అంగుళాల QHD + డైనమిక్ అమోల్డ్ 2x డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేటు, ఫ్రంట్, వెనుక భాగంలో గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉండటం వంటివి ఈ ఫోన్‌ని ప్రత్యేకం చేశాయి. వీటికిమించిన సూపర్ ఫీచర్స్ ఈ మొబైల్ కెమెరా సెటప్ సొంతం. 


సూపర్ లెన్స్ కెమెరా సెటప్
200MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరా, 3 రెట్లు జూమ్ చేసుకునేలా 10MP టెలిఫోటో షూటర్, 10 రెట్ల ఆప్టికల్ జూమ్ లెన్స్‌తో 10MP టెలిఫోటో కెమెరా, అందమైన సెల్ఫీల కోసం 12MP కెమెరాను అమర్చారు. ఫోటోలు, వీడియోలు క్లారిటీ విషయంలో యాపిల్ ఐఫోన్‌తో పోటీపడేలా శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా స్మార్ట్ ఫోన్ కెమెరా సెటప్‌ని ఏర్పాటు చేశారు. ఇవన్నీ కలిసి శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా స్మార్ట్ ఫోన్‌ని మిగతా ఫోన్స్ కంటే ఎక్కువ క్రేజ్ ఏర్పడేలా చేశాయి. 


రూ. 8 వేల డిస్కౌంట్ తరువాత శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ధర ఎంతంటే..
శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ. 1,24,999 గా ఉండగా.. రూ. 8 వేల డిస్కౌంట్ అనంతరం ఈ ఫోన్‌ని రూ. 1,16,999 కే సొంతం చేసుకోవచ్చు అని శాంసంగ్ తమ తాజా ప్రకటనలో పేర్కొంది.


ఇది కూడా చదవండి : Okaya Faast F3 EV Scooter: మార్కెట్లోకి మరో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆకట్టుకుంటున్న ఫీచర్స్


ఇది కూడా చదవండి : Renault Kwid Prices: మరింత తక్కువ ధరలో రెనో క్విడ్ RXE వేరియంట్..


ఇది కూడా చదవండి : Why Cars Catches Fire: కార్లలో మంటలు ఎందుకు వస్తాయో తెలిస్తే మీరు కూడా జాగ్రత్త పడతారు


ఇది కూడా చదవండి : Highest Selling Car Brands: ప్రస్తుతం ఎక్కువగా సేల్ అవుతున్న కార్లు ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook