Renault Kwid Prices: మరింత తక్కువ ధరలో రెనో క్విడ్ RXE వేరియంట్..

Renault Kwid RXE Variant Price : 2015లో భారత మార్కెట్లోకి తొలిసారిగా ఎంట్రీ ఇచ్చిన రెనో క్విడ్ కారు.. చెన్నై ఫెసిలిటీలో తయారవుతూ మేక్ ఇన్ ఇండియా ఆటోమొబైల్ ప్రోడక్టుగా ఇండియన్ కస్టమర్స్‌కి అందుబాటులోకి వచ్చింది. ఆక్సిజన్ సెన్సార్‌లతో పాటు డ్రైవింగ్ చేసే సమయంలో కారు ఉద్గార స్థాయిలను నిరంతరం పర్యవేక్షించేలా రెనో క్విడ్ RXE వేరియంట్‌ ని తయారు చేశారు.

Last Updated : Feb 11, 2023, 04:03 PM IST
Renault Kwid Prices: మరింత తక్కువ ధరలో రెనో క్విడ్ RXE వేరియంట్..

Renault Kwid RXE Variant Price :  రెనో ఇండియా నుంచి ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ క్విడ్ కారు కొత్త RXE వేరియంట్‌ ఇటీవలే లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 2న లాంచ్ అయిన ఈ కొత్త క్విడ్ ఆర్ఎక్స్ఈ వేరియంట్‌ ధర కూడా ఆకర్షిణీయంగా ఉందని.. దీంతో క్విడ్ కారు ఇండియన్ కస్టమర్స్ కి మరింత అందుబాటులోకి వచ్చిందని రెనో కంపెనీ ప్రకటించింది. రెనో క్విడ్ RXE వేరియంట్‌ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.69 లక్షలుగా నిర్ణయించింది. అయితే ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 1.0 L పెట్రోల్ ఇంజన్ తో లాంచ్ అయిన రెనో క్విడ్ RXE వేరియంట్‌ BS6 స్టెప్ 2 కి అనుగుణంగా రూపొందించారు. ఆక్సిజన్ సెన్సార్‌లతో పాటు డ్రైవింగ్ చేసే సమయంలో కారు ఉద్గార స్థాయిలను నిరంతరం పర్యవేక్షించేలా రెనో క్విడ్ RXE వేరియంట్‌ ని తయారు చేశారు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, ఫోన్ నియంత్రణలపై టర్న్ ఇండికేటర్స్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ఎత్తయిన ప్రదేశాల్లో కారు నడిపే సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా హిల్ స్టార్ట్ అసిస్ట్ (HSA), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి ఫీచర్లు రెనో క్విడ్ RXE వేరియంట్‌ సొంతం.

2015లో భారత మార్కెట్లోకి తొలిసారిగా ఎంట్రీ ఇచ్చిన రెనో క్విడ్ కారు.. చెన్నై ఫెసిలిటీలో తయారవుతూ మేక్ ఇన్ ఇండియా ఆటోమొబైల్ ప్రోడక్టుగా ఇండియన్ కస్టమర్స్‌కి అందుబాటులోకి వచ్చింది. షెడ్యూల్ కంటే ముందుగానే ప్రభుత్వం నిర్ధేశించిన రూల్స్ ప్రకారం BS6 స్టెప్ 2 సమ్మతిని సాధించడంపై, రెనో ఇండియా ఆపరేషన్స్ కంట్రీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్‌రామ్ మామిళ్లపల్లె స్పందిస్తూ.. " క్లీన్ అండ్ గ్రీన్ ఎన్విరాన్‌మెంట్ కోసం భారత ప్రభుత్వం చేస్తోన్న కృషికి రెనో ఇండియా కట్టుబడి ఉంది " అని అన్నారు.

ఇది కూడా చదవండి : Why Cars Catches Fire: కార్లలో మంటలు ఎందుకు వస్తాయో తెలిస్తే మీరు కూడా జాగ్రత్త పడతారు

ఇది కూడా చదవండి : Highest Selling Car Brands: ప్రస్తుతం ఎక్కువగా సేల్ అవుతున్న కార్లు ఇవే

ఇది కూడా చదవండి : Maruti Cars Discount: కొత్తగా కారు కొనేవారికి గుడ్ న్యూస్.. మారుతి కార్లపై రూ. 46 వేల వరకు డిస్కౌంట్.. ఫుల్ డీటేల్స్

ఇది కూడా చదవండి : Rs 39,000 Smartphone for Rs 8000: రూ. 39 వేల స్మార్ట్ ఫోన్ జస్ట్ రూ. 8 వేలకే.. బంపర్ ఆఫర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News