SBI Charges: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు మరో షాక్ తగిలింది. ఎటువంటి లాభాదేవీలు జరపకుండానే అకౌంట్‌లో నుంచి డబ్బులు కట్ అవుతున్నాయంటూ వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. చాలా మంది ఖాతాదారుల అకౌంట్ నుంచి రూ.147.50 కట్ అయినట్లు మెసేజ్ వస్తోంది. ఈ సందేశాన్ని చూసి చాలా మంది ఖాతాదారులు బ్యాంకుకు వెళ్లి విచారించగా.. బ్యాంక్ అధికారుల సమాధానం విని అవాక్కవుతున్నారు. అవును  నిజం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కస్టమర్ల ఖాతా నుంచి మెయింటెనెన్స్ ఛార్జీగా ఈ డబ్బును కట్ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ట్వీట్‌ చేస్తూ బ్యాంక్‌ సమాచారం ఇచ్చింది. ఈ సొమ్మును బ్యాంకు నుంచి 18 శాతం జీఎస్టీ ఛార్జీగా తీసివేసినట్లు తెలుస్తోంది. బ్యాంక్ జారీ చేసిన డెబిట్ కార్డు కోసం కస్టమర్ల నుంచి ఏడాదికి రూ.125 రికవరీ చేస్తోంది. ఇందుకు అదనంగా 18 శాతం జీఎస్టీ కలిపితే ఈ మొత్తం రూ.147.50 అవుతుంది. ఈ మొత్తం అమౌంట్‌ను కస్టమర్ల ఖాతా నుంచి కట్ చేస్తోంది. అంతేకాకుండా ఎవరైనా ఖాతాదారుడు డెబిట్ కార్డును మార్చుకోవాలనుకుంటే.. బ్యాంకుకు 300 రూపాయలకు ప్లస్ జీఎస్టీ ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. 


కాగా ఇటీవలె లోన్ల‌పై వడ్డీ రేట్లను పెంచి ఝలక్ ఇచ్చిన విషయం తెలిసిందే. బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ల (MCLR)ను ఒక ఏడాది పాటు పెంచాలని నిర్ణయించింది. ఈ పెంపు తర్వాత హౌసింగ్ లోన్, కారు లోన్, ఎడ్యుకేషన్ లోన్, పర్సనల్ లోన్ వంటి అన్ని రకాల రుణాలపై అధిక వడ్డీ రేటును చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం లోన్‌ తీసుకున్న వారిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.


బ్యాంక్ ఒక సంవత్సరం కాలానికి ఎంసీఎల్‌ఆర్‌ను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. గతంలో బ్యాంకు ఒక సంవత్సరం రుణంపై 8.30 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేయగా.. ఇప్పుడు అది 8.40 శాతానికి పెరిగింది. ఈ పెరుగుదల కారణంగా హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ మొదలైన అన్ని రకాల లోన్‌లపై ఎక్కువ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఈ పెంపు జనవరి 15 నుంచి అమలు చేస్తోంది. 


Also Read: Maharashtra Road Accident: మహారాష్ట్రలో రెండు ఘోర ప్రమాదాలు.. 13 మంది మృతి  


Also Read: Hardik Pandya: థర్డ్ అంపైర్ కళ్లు మూసుకున్నారా..? పాండ్యా ఔట్‌పై వివాదం.. ఇషాన్ కిషన్ రివేంజ్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి