నూతన ఆర్థిక సంవత్సరం నేటి నుంచి ప్రారంభం కానుంది. అయితే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank of India) తన ఖాతాదారులను అప్రమత్తం చేసింది. నేడు స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు కొంత సమయం సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏప్రిల్ 1వ తేదీన అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ మెయింటనెన్స్ కారణంగా కొన్ని సేవలకు అంతరాయం ఏర్పడనుంది. మధ్యాహ్నం 2:10 గంటల నుంచి సాయంత్రం 5:40 గంటల వరకు ఇంటర్‌నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్ లాంటి భారతీయ స్టేట్ బ్యాంక్ సేవలు అందుబాటులో ఉండవని స్టేట్ బ్యాంక్(State Bank Of India) తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ముందుగానే సమాచారం అందించింది. 


Also Read: Gold Price Today 01 April 2021: గుడ్ న్యూస్, మళ్లీ పతనమైన బంగారం ధరలు, వెండి ధరలు



సాధారణంగా ప్రతి నెల మొదలయ్యే రోజు కొన్ని కొత్త సర్వీసులు, పన్నులు, ధరలు పెరగడం జరుగుతుంది. తాజాగా ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యే రోజున రెండున్నర గంటలపాటు మెయింటనెన్స్ పనుల కారణంగా కొన్ని సేవలు అందుబాటులో ఉండవని, ఆ సమయంలో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయకూడదని ఖాతాదారులను హెచ్చరించింది.


భారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఎస్‌బీఐ అతిపెద్దది. అందులో మిలియన్ల మంది ఖాతాదారులకు సేవలు అందిస్తూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఖాతాదారులకు ముందు జాగ్రత్తగా సమాచారం అందించింది. కనుక ఆ నిర్దేశిత సమయంలో పైన పేర్కొన్న సేవలను అందించలేదు. ఖాతాదారులు జాగ్రత్తగా తమ లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలి.


Also Read: ITR Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త చట్టాలు, కొత్త నియమాలు ఇవే, ఎవరిపై ప్రభావం 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook