ITR Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త చట్టాలు, కొత్త నియమాలు ఇవే, ఎవరిపై ప్రభావం

ఏప్రిల్ 1 నుంచి ఎల్పీజీ సిలిండర్ ధర, బ్యాంకుల విలీనం కారణంగా బ్యాంకింగ్ నియమాలు, ఈపీఎఫ్ పెట్టుబడి పరంగా ఆదాయపు పన్ను నిబంధన మార్పులు, టీడీఎస్ / టీసీఎస్ మినహాయింపు మొదలైనవి ఉన్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం నుండి ధరలు పెరుగుతున్నందున కొన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి.

1 /5

ప్రతి నెల ఎల్‌పీజీ సిలిండర్ ధరలు మారుతాయని ప్రభుత్వం ప్రకటించడంతో ఎల్‌పీజీ ధరల పెరుగుతాయి. మార్చి 2021లో ఢిల్లీలో ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ .769 నుంచి రూ .819 కు పెంచారు. ఏప్రిల్‌లోనూ మరోసారి ధర పెరిగే అవకాశం ఉంది. Also Read: Gold Price Today 28 March 2021: బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధరలు, దిగొచ్చిన వెండి ధరలు

2 /5

దేనా బ్యాంక్, విజయ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు అలహాబాద్ బ్యాంక్ - ఈ ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకులలో మీకు బ్యాంక్ ఖాతా ఉంటే ఇక నుంచి వారి పాస్ బుక్ మరియు చెక్ బుక్ పనిచేయవు. ఎందుకంటే ఈ బ్యాంకులు ఇతర బ్యాంకులతో విలీనం అయ్యాయి. Also Read: 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్, LTC, మార్చి 31 తుది గడువు

3 /5

ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఈపీఎఫ్ ఖాతాలో నగదు నిల్వలు సైతం ఆదాయపు పన్ను చట్టం పరిధిలోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా ఈ మార్పులు తీసుకొచ్చింది. రూ.2.5 లక్షలు మించితే దానిపై పన్ను వసూలు చేయనున్నారు.

4 /5

ఏప్రిల్ 1, 2021 నుండి TDS (పన్ను మినహాయింపు) కోసం ఆదాయపు పన్ను చట్టంలో కొన్ని నియమాలు కూడా మార్చారు. ఒక వ్యక్తి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)ను దాఖలు చేయకపోతే, బ్యాంక్ డిపాజిట్లపై టీడీఎస్ రేటు రెట్టింపు అవుతుంది. Also Read: EPFO: తెరపైకి కొత్త వేతన కోడ్, EPFతో పాటు జీతాల్లో ఏప్రిల్ 1 నుంచి మార్పులు

5 /5

ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ప్రయాణ రాయితీ (LTC) లేదా ఎల్‌టీసీ క్యాష్ వోచర్ పథకం మినహాయింపు ఉంటుంది. ఈ పథకం కింద ఒక ఉద్యోగి కొన్ని వస్తువులు లేదా సేవల కొనుగోలు చేసి ఎల్‌టిసి భత్యం కింద మినహాయింపు పొందటానికి అనుమతిస్తుంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook