SBI MCLR Hike: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. మార్జినల్ లెండింగ్ రేటు (MCLR)ను 10 బేసిస్ పాయింట్స్ పెంచింది. అన్ని రకాల టెన్యూర్స్‌కి ఇది వర్తిస్తుంది. ఏప్రిల్ 15 నుంచే ఈ నిర్ణయం అమలులోకి వచ్చినట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. ఎస్‌బీఐ తాజా నిర్ణయంతో రుణాలపై వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. అలాగే గృహ రుణాలు, వాహన రుణాలు, ఇతరత్ర రుణాలు చెల్లించేవారిపై ఈఎంఐ భారం మరింత పెరగవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎంసీఎల్‌ఆర్ పెంపు వివరాలు :


1) ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 6.65 శాతం నుంచి 6.75 శాతానికి పెంపు
2) ఒక నెల టెన్యూర్‌పై ఎంసీఎల్ఆర్ 6.65 నుంచి 6.75 శాతానికి పెంపు
3) 3 నెలల టెన్యూర్‌పై ఎంసీఎల్ఆర్ 6.65 శాతం నుంచి 6.75 శాతానికి పెంపు
4)6 నెలల టెన్యూర్‌పై ఎంసీఎల్ఆర్ 6.95 శాతం నుంచి 7.05 శాతానికి పెంపు
5)ఒక ఏడాది కాలానికి ఎంసీఎల్ఆర్ 7 శాతం నుంచి 7.10 శాతానికి పెంపు
6)రెండేళ్ల కాల పరిమితికి ఎంసీఎల్ఆర్ 7.2 శాతం నుంచి 7.3 శాతానికి పెంపు
7)మూడేళ్ల కాల పరిమితిపై ఎంసీఎల్ఆర్ 7.3 శాతం నుంచి 7.4 శాతానికి పెంపు 


ఎస్‌బీఐ రుణ గ్రహీతలపై ఎఫెక్ట్ :


సాధారణంగా బ్యాంకులు ఎంసీఎల్ఆర్ ఆధారంగానే రుణాలపై వడ్డీ రేట్లు నిర్ణయిస్తాయి. రెపో రేటు, లెండింగ్ రేట్ల ఆధారంగా ప్రతీ నెలా ఎంసీఎల్ఆర్‌లో సవరణలు జరగుతాయి. ఎంసీఎల్‌ఆర్ కన్నా తక్కువ రేటుతో బ్యాంకులు రుణాలు ఇవ్వడం కుదరదు. అయితే ఆ బ్యాంకులో పనిచేసే ఉద్యోగులు, డిపాజిట్లపై మాత్రం దీనికి మినహాయింపు ఉంటుంది. తాజా ఎంసీఎల్ఆర్ పెంపుతో... ఎస్‌బీఐ నుంచి రుణాలు పొందే కస్టమర్లపై వడ్డీ రేట్ల రూపంలో ఆ ఎఫెక్ట్ పడవచ్చు. అలాగే ఇప్పటికే రుణాలు పొందినవారిపై ఈఎంఐ రూపంలో మరింత భారం తప్పకపోవచ్చు.


Also Read: Railway Ticket at Post offices: త్వరలో పోస్టాఫీసుల్లో రైల్వే టికెట్ బుకింగ్


Also Read:  Telangana Job Notifications: నిరుద్యోగులకు మంత్రి హరీశ్ రావు గుడ్ న్యూస్... వారం రోజుల్లో పోలీస్ రిక్రూట్‌మెంట్  నోటిఫికేషన్ 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook