Telangana Jobs: నిరుద్యోగులకు మంత్రి హరీశ్ రావు గుడ్ న్యూస్.. వారం రోజుల్లో పోలీస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్

Telangana Job Notifications: తెలంగాణ నిరుద్యోగులకు మంత్రి హరీశ్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. వారం రోజుల్లో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడుతుందని చెప్పారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 18, 2022, 02:33 PM IST
  • తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్
  • వారం రోజుల్లో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
  • ప్రకటించిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు
Telangana Jobs: నిరుద్యోగులకు మంత్రి హరీశ్ రావు గుడ్ న్యూస్.. వారం రోజుల్లో పోలీస్ రిక్రూట్‌మెంట్  నోటిఫికేషన్

Telangana Job Notifications: తెలంగాణ మంత్రి హరీశ్ రావు నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. వారం రోజుల్లో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుందని తెలిపారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ పోలీస్ ఉద్యోగాలకు 3 ఏళ్ల వరకు వయోపరిమితిని పెంచినట్లు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నిరుద్యోగ అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ తరగతులను మంత్రి హరీశ్ రావు సోమవారం (ఏప్రిల్ 18) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లపై ప్రకటన చేశారు. 

సీఎం కేసీఆర్ చొరవతో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయని హరీశ్ రావు పేర్కొన్నారు. పోలీస్ ఉద్యోగాల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్ కల్పించామని... దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. పోలీస్ శాఖతో పాటు ఇతర శాఖల్లోని ఖాళీలను కూడా భర్తీ చేయబోతున్నామని... మొత్తంగా ఈ ఏడాది 91 వేల ఉద్యోగాల భర్తీ ఉంటుందని తెలిపారు. 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 1,32,000 ఉద్యోగాల భర్తీ జరిగిందని హరీశ్ రావు అన్నారు. త్వరలో భర్తీ చేయబోయే 91 వేల ఉద్యోగాలతో కలిపి మొత్తం 2 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసినట్లవుతుందన్నారు. వచ్చే ఏడాది నుంచి జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయనున్నామని తెలిపారు. 

బండి సంజయ్‌కి హరీశ్ చురకలు :

మోకాళ్ల యాత్ర, పాదయాత్ర చేయడం కాదని... కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 15 లక్షలకు పైగా ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారని మంత్రి హరీశ్ రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని ప్రశ్నించారు. ధరలు పెంచినందుకు... ఉద్యోగాలు ఇవ్వనందుకు.. ప్రజల జీవితాలను ఆగం చేసినందుకు యాత్ర చేస్తున్నారా.. ఏం ముఖం పెట్టుకుని ప్రజల్లో తిరుగుతున్నారంటూ నిలదీశారు.

కుల మతాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ లబ్ది పొందాలని చూస్తోందని మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీపై తెలంగాణ విద్యార్థులు ప్రధాని మోదీ, బండి సంజయ్, కిషన్ రెడ్డిలను ట్విట్టర్ వేదికగా నిలదీయాలని పిలుపునిచ్చారు. 

Also Read: Railway Ticket at Post offices: త్వరలో పోస్టాఫీసుల్లో రైల్వే టికెట్ బుకింగ్

Also Read:  IPL Delhi Capitals: ఐపీఎల్‌కు కరోనా షాక్.. ఢిల్లీ ఆటగాడికి పాజిటివ్.. పంజాబ్‌తో మ్యాచ్‌ డౌటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News