SBI Annuity Scheme Details Benefits: దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా అనేక రకాల పొదుపు పథకాలను పరిచయం చేస్తోంది. వీటిలో ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ పథకానికి భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ పథకం కింద కస్టమర్‌లు ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే.. నిర్ణీత వ్యవధి తర్వాత నెలవారీ ఆదాయాన్ని పొందుతారు. ఈ స్కీమ్ కింద 3 ఏళ్ల నుంచి పదేళ్ల వరకు వివిధ రకాల కాల వ్యవధికి పెట్టుబడి పెట్టవచ్చు. ఎవరి ప్రాధాన్యతలు, ఆర్థిక లక్ష్యాలను బట్టి కస్టమర్‌లు 36, 60, 84 లేదా 120 నెలల డిపాజిట్ వ్యవధిని ఎంచుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ పథకంలో గరిష్ట డిపాజిట్ పరిమితి లేదు. కస్టమర్‌లు తమ అవసరాలకు అనుగుణంగా స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని పొందేందుకు వీలు కల్పిస్తూ.. వారు కోరుకున్న మొత్తాన్ని పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది. అయితే ఎంచుకున్న పదవీ కాలంలో నెలవారీ చెల్లింపుగా కనీసం 1,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ సాధారణ పొదుపు ఖాతాల కంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తుంది. అకౌంట్ తెరిచే సమయంలో వర్తించే వడ్డీ రేటు, బ్యాంక్ అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్ల మాదిరిగానే మొత్తం పదవీకాలమంతా స్థిరంగా ఉంటుంది.


ఒక వ్యక్తి 7.5 శాతం వడ్డీ రేటుతో స్కీమ్‌లో రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టారనుకుంటే.. ఈ పెట్టుబడి సుమారుగా రూ. 11,870 నెలవారీ ఆదాయాన్ని ఇస్తుంది. ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ పథకం బ్యాంక్‌ అన్ని శాఖలలో సులభంగా అందుబాటులో ఉంటుంది. ఆసక్తి గల కస్టమర్‌లు స్కీమ్ వివరాలు, ప్రయోజనాలు, ప్రస్తుత వడ్డీ రేట్ల గురించి విచారించడానికి వారి సమీపంలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌ను సంప్రదించవచ్చు. రివార్డింగ్‌తో కూడిన ఆర్థిక మార్గాన్ని కోరుకునే పెట్టుబడిదారులకు ఈ స్కీమ్ ఒక మంచి ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు.


Also Read: West Bengal Fire Accident: బాణసంచా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. 8 మంది దుర్మరణం  


Also Read: Pakistan ODI Rank: వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్‌ టీమ్‌గా పాకిస్థాన్.. భారత్ ర్యాంక్ ఎంతంటే..?  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook