SBI Mobile Number Change: బ్యాంకుకు వెళ్లకుండా ఎస్‌బీఐ మొబైల్ నెంబర్ ఇలా చేంజ్ చేసుకోండి
SBI Registered Mobile Number Change: భారతీయ స్టేట్ బ్యాంక్ ఖాతాదారులు ఇంటివద్దనే కూర్చుని ఇంటర్నెంట్ బ్యాంకింగ్ ద్వారా సులువుగా తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ను మార్చుకోవచ్చు. కరోనా వ్యాప్తి సమయంలో బ్యాంకులు సైతం కస్టమర్లను ఇంటివద్ద ఉండి సేవలు వినియోగించుకునేలా చేస్తోంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) ఖాతాదారులు లావాదేవిలు చేసిన సమయంలో రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు మెస్సేజ్‌లు వస్తుంటాయి. అయితే కొందరు తమ ఫోన్ నెంబర్‌ను మార్చేసినా, బ్యాంకు ఖాతాలకు పాత నెంబర్‌ను కొనసాగిస్తుంటారు. దాని వల్ల వారికి నగదు విత్‌డ్రా చేసినా, క్యాష్ డిపాజిట్ చేసినా మొబైల్‌కు సందేశాలు రావు.
భారతీయ స్టేట్ బ్యాంక్ ఖాతాదారులు ఇంటివద్దనే కూర్చుని ఇంటర్నెంట్ బ్యాంకింగ్ ద్వారా సులువుగా తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ను మార్చుకోవచ్చు. కరోనా వ్యాప్తి సమయంలో బ్యాంకులు సైతం కస్టమర్లను ఇంటివద్ద ఉండి సేవలు వినియోగించుకునేలా చేస్తోంది. ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్ ఉన్నవారు, తమ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి ఎస్‌బీఐ (State Bank Of India) ఖాతాదారులు తమ రిజిర్టర్డ్ మొబైల్ నెంబర్‌ను మార్చుకునే అవకాశం ఉందని ట్వీట్ చేసింది. ఇందుకోసం కింద తెలిపిన విధానాన్ని పాటిస్తే సరి.
Also Read: LIC Policy: ఒక్కసారి డిపాజిట్ చేస్తే ప్రతినెల రూ.6,859 మీ చేతికి అందిస్తున్న ఎల్ఐసీ
Step 1: ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ https://retail.onlinesbi.com/retail/login.htm సైట్‌లో లాగిన్ అవ్వాలి
Step 2: లాగిన్ అయిన తరువాత Profile ట్యాబ్‌కు వెళ్లాలి
Step 3: Personal Details లింక్ మీద క్లిక్ చేయండి
Step 4: మీ ప్రొఫైల్ పాస్‌వర్డ్ టైప్ చేయండి. అనంతరం మీ పేరు, ఈమెయిల్ ఐడీ మరియు మొబైల్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి
Step 5: ఛేంజ్ మొబైల్ నెంబర్ డొమెస్టిక్ ఓన్లీ (Change Mobile Number-Domestic only ఆప్షన్ మీద క్లిక్ చేయండి
Step 6: పర్సనల్ డిటేల్స్ - మొబైల్ నెంబర్ అప్‌డేట్ అని క్రియేట్ రిక్వెస్ట్, క్యాన్సల్ రిక్వెస్ట్ మరియు స్టేటస్ అనే మూడు ట్యాబ్స్ కనిపిస్తాయి.
Step 7: మీరు మారాలనుకుంటున్న కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి
Step 8: కొత్త మొబైల్ నెంబర్‌ను మరోసారి నమోదు చేయండి
Step 9: Submit బటన్ మీద క్లిక్ చేయాలి
Step 10: అనంతరం Verify and confirm your mobile number xxxxxxxxxx' అని స్క్రీన్ మీద కనిపిస్తుంది
Step 11: ఓకే మీద క్లిక్ చేస్తే సరి.
Also Read: Income Tax Returns 2020-21: ఐటీ రిటర్న్స్ దాఖలు గడువు పొడిగించిన సీబీడీటీ
ఒక వేళ మీరు ఏటీఎం కార్డ్ ద్వారా మొబైల్ నెంబర్ ఛేంజ్ చేయాలనుకుంటే...
Step 1: మీ ఏటీఎం కార్డును ఏటీఎం మేసీన్ ఇన్‌సర్ట్ చేయాలి
Step 2: మెనూ ఆప్షన్‌లో రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి
Step 3: ఆ తరువాత మీ ఏటీఎం పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి
Step 4: అప్‌డేట్ యువర్ మొబైల్ నెంబర్ (Update Your Mobile Number) ఆప్షన్ మీద క్లిక్ చేయండి
Step 5: మీ పాత మొబైల్ నెంబర్ నమోదు చేసి వెరిఫై చేసుకోవాలి.
Step 6: అనంతరం మీరు మార్చాలనుకున్న కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కన్ఫామ్ చేయాలి. మీ పాత, కొత్త మొబైల్ నెంబర్లకు ఓటీపీ వస్తుంది.
Step 7: ఆ రెండు మొబైల్ నెంబర్ల నుంచి ACTIVATE <ఓటీపీ నెంబర్> <13 అంకెల రిఫరెన్స్ నెంబర్> ను 567676కు నాలుగు గంటలలోగా మెస్సేజ్ చేయాలి. ఒక వేళ పాత నెంబర్ వాడుకలో లేకుంటే కొత్త నెంబర్ నుంచి మెస్సేజ్ పంపించాలి. ఉదాహరణకు మెస్సేజ్ ఇలా ఉంటుంది. ACTIVATE 12345678 UM12591200143
Step 8: ఓటీపీ నెంబర్, కొత్త మొబైల్ నెంబర్, రిఫరెన్స్ నెంబర్ ధ్రువీకరించిన తరువాత ఇంటర్నెట్ బ్యాంకింగ్, సీబీఎస్ మరియు ఏటీఎంలో రిజిస్టర్ అవుతుంది. ప్రక్రియ పూర్తయ్యాక మీ మొబైల్ నెంబర్‌కు మెస్సేజ్ సైతం వస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook