SBI account holders updates: మీకు ఎస్బీఐలో ఎకౌంట్ ఉందా ? SBI ATM card వెంట లేనప్పుడు ఏటీఎం నుండి క్యాష్ ఎలా విత్ డ్రా చేయాలి అని ఆలోచిస్తున్నారా ? అయితే మీలాంటి వారి కోసమే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ సరికొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. SBI YONO app ద్వారా ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ ఉన్న వారు డెబిట్ కార్డు లేకున్నా ఎంపిక చేసిన కొన్ని ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రా చేసుకోవచ్చని ఎస్బీఐ వెల్లడించింది. SBI account కలిగి ఉన్న ఖాతాదారులు ఎవరైనా Yono app ద్వారా  ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్‌లోకి లాగాన్ అవ్వొచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎస్బిఐ యోనో యాప్‌లోకి లాగిన్ అయిన తరువాత, ఎస్బిఐ ఖాతాదారుడు యోనో క్యాష్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ATM విభాగానికి వెళ్లి మీరు ATM నుండి ఉపసంహరించుకోవాలనుకుంటున్న మొత్తాన్ని ఎంటర్ చేయండి. SBI నుండి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్‌బిఐ యోనో క్యాష్ Transaction number ను వస్తుంది. ఎస్బిఐ ఖాతాదారుడు ఈ నెంబర్‌ను, పిన్‌ను ఎస్బిఐ యోనో క్యాష్ పాయింట్లలో ఉపయోగించాలి. ఎస్బీఐ యోనో క్యాష్ పాయింట్స్‌నే  కార్డ్‌లెస్ ట్రాన్సాక్షన్ ఎనేబుల్ చేసిన ఎస్బిఐ ఎటిఎంలు అని కూడా పిలుస్తారు. నగదు ఉపసంహరణ కోసం. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి వచ్చిన ఎస్‌బిఐ యోనో క్యాష్ ట్రాన్సాక్షన్ నెంబర్ 4 గంటల పాటు చెల్లుతుంది.


Also read : Axis Bank Credit card: ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే క్రెడిట్ కార్డు


SBI ATM centres వద్ద ఎస్బిఐ ఖాతాదారుడు ఎటిఎమ్ స్క్రీన్‌పై కనిపించే Card-less transactions అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఆ తరువాత యోనో క్యాష్‌ సెలెక్ట్ చేసుకుని వివరాలు ఎంటర్ చేయాలి. మీకు దగ్గర్లో ఉన్న యోనో క్యాష్ పాయింట్లు / కార్డ్ లెస్ ఏటీఎం సెంటర్లను గుర్తించే అవకాశాన్ని కూడా యోనో యాప్ అందిస్తుంది. సులభంగా యాక్సిస్ చేయడం కోసం యోనో యాప్‌లో క్విక్ లింక్స్ అందుబాటులో ఉన్నాయి. SBI Yono App ఉపయోగించి నగదు ఉపసంహరించుకునేందుకు రూ .10,000 ను గరిష్ట పరిమితిగా నిర్ణయించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook