State Bank Of India: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. మీ ఖాతాలోకి నేరుగా రూ.40,088..!
SBI New Scheme 2023: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచిన తరువాత అన్ని బ్యాంకులు తన వడ్డీ రేట్లలో మార్పులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎస్‌బీఐ కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను మార్చింది. తన కస్టమర్లకు నేరుగా రూ.40,088 లబ్ధి చేకూరేలా సరికొత్త స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. పూర్తి వివరాలు ఇలా..
SBI New Scheme 2023: ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. మార్చి 31 వరకు సూపర్ బెనిఫిట్ పొందనున్నారు. ఖాతాదారులకు రూ.40,088 ప్రయోజనం లభిస్తుందని బ్యాంక్ వెల్లడించింది. బ్యాంక్ ఇటీవల ఎఫ్‌డీ రేట్లను పెంచిన విషయం తెలిసిందే. 400 రోజుల ఎఫ్‌డీపై 7.1 శాతం రేటు ప్రయోజనాన్ని అందిస్తోంది. దీంతో రూ.2 కోట్లలోపు మొత్తంపై 25 బేసిస్ పాయింట్లు పెరిగాయి. మార్చి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
మీరు ఎస్‌బీఐలో రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే.. మెచ్యూరిటీ తర్వాత రూ.5,40,088 పొందవచ్చు. ఇందులో మీకు రూ.40,088 వడ్డీ లభిస్తుంది. ఇది మీ ఫిక్స్‌డ్ ఇన్‌కమ్. ఈ ఆఫర్ గురించి పూర్తి వివరాల కోసం మీకు దగ్గరలోని ఏ ఎస్‌బీఐ బ్రాంచ్ అయినా సంప్రదించవచ్చు. మార్చి 31వ తేదీలోపు పెట్టుబడి పెట్టి.. మంచి ఆదాయాన్ని పొందండి.
ఇక రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్ల విషయానికి వస్తే.. బ్యాంక్ దీనిపై 25 బేసిస్ పాయింట్లను పెంచింది. ఎస్‌బీఐ మొదటి సంవత్సరం మెచ్యూరిటీ ఎఫ్‌డీ 6.75 శాతవం వడ్డీ ప్రయోజనం అందిస్తోంది. ఇప్పుడు దీనిపై 0.05 శాతం పెరిగి.. 6.80 శాతానికి చేరుకుంది. ఇంతకుముందు 2 సంవత్సరాల ఎఫ్‌డీలపై 6.75 శాతం వడ్డీ లభించగా.. ఇప్పుడు 7 శాతం వడ్డీ ప్రయోజనం లభిస్తున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది.
మూడు సంవత్సరాల మెచ్యూరిటీతో ఎఫ్‌డీ విషయానికి వస్తే.. ఇంతకుముందు ఇది 6.25 శాతం చొప్పున ప్రయోజనం లభించేది. తాజాగా అది 6.50 శాతం వడ్డీకి పెరిగింది. అదేసమయంలో ఐదేళ్ల మెచ్యూరిటీ ఉన్న ఎఫ్‌డీలపై గతంలో ఉన్న 6.25 శాతానికి బదులుగా.. ఇప్పుడు 6.50 శాతం వడ్డీని అందుకుంటున్నారు. బ్యాంక్ కొత్త రేట్లు ఫిబ్రవరి 15 నుంచి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే.
Also Read: Gannavaram: గన్నవరంలో ఉద్రిక్తం.. టీడీపీ ఆఫీసుపై ఎమ్మెల్యే వంశీ వర్గీయులు దాడి
Also Read: Income Tax Return 2023: పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమనిక.. ఐటీఆర్ ఫారమ్‌లో కీలక మార్పులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి