SBI gold loans interest rates : న్యూఢిల్లీ: మీరు గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా ? అది కూడా ఎస్బీఐలో గోల్డ్ లోన్ కోసం ప్రయత్నిస్తున్నారా ? అయితే ఇది మీ కోసమే. యోనో ప్లాట్‌‌ఫామ్‌‌ ద్వారా గోల్డ్‌‌ లోన్ తీసుకోవాలనుకునే కస్టమర్లకు వడ్డీలో డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. బంగారు నగలు, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కెట్స్‌ని తనఖా పెట్టి గోల్డ్‌ ‌లోన్‌ తీసుకుంటారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధరలు (Gold prices today in Hyderabad) పెరగడంతో బంగారంపై అధిక మొత్తంలో రుణం తీసుకునే వారికి కొంత కలిసొచ్చే అంశం కానుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎస్బీఐ ప్రకటించిన ఆఫర్స్ ప్రకారం యోనో యాప్ ద్వారా గోల్డ్ లోన్ కోసం అప్లై (Gold loan through YONO app) చేసుకున్న కస్టమర్లకు 7.5 శాతం వడ్డీకే గోల్డ్‌‌ లోన్‌‌ లభించనుంది. ప్రస్తుతం బంగారంపై ఎస్బీఐ అందిస్తున్న రుణాల వడ్డీ రేటు కంటే ఇది 0.75 శాతం తక్కువ. సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఎస్బీఐ స్పష్టంచేసింది. బంగారం విలువ ఆధారంగా రూ. 20 వేల నుంచి రూ. 50 లక్షల వరకు గోల్డ్ లోన్‌‌ పొందవచ్చు. 


ఎస్బీఐ అందించే గోల్డ్ లోన్స్‌లో ఉన్న మరో సౌలభ్యం ఏంటంటే.. ఒకవేళ లోన్ టెన్యూర్ కంటే ముందుగానే డబ్బులు సర్దుబాటు చేసుకుని లోన్ క్లోజ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే, ఎలాంటి ప్రీక్లోజర్ ఛార్జీలు (Gold loan pre-closure charges) లేకుండానే లోన్ క్లోజ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.


How to apply for gold loan on Yono: యోనో‌ యాప్ ద్వారా గోల్డ్ లోన్‌‌ తీసుకునే విధానం


యోనో యాప్‌‌లో లాగిన్ (Yono app login) అయిన అనంతరం హోమ్ పేజిలోని మెను బార్‌‌‌‌ను క్లిక్ చేసి లోన్స్ సెక్షన్‌‌ను ఓపెన్ చేయాలి. 


డ్రాప్‌డౌన్‌ జాబితాలో కనిపించే గోల్డ్‌‌ లోన్‌ను క్లిక్ చేసి అక్కడ అడిగిన వివరాలు నమోదు చేసి గోల్డ్ లోన్‌‌కు అప్లై చేయాలి.


ఎస్బీఐ బ్యాంకులో గోల్డ్ లోన్ కోసం తనఖా (Mortgage) పెట్టే బంగారు ఆభరణాల బరువు, వాటి విలువ, క్యారెట్లలో బంగారం నాణ్యత వంటి వివరాలు పొందుపర్చాలి. 


ఆ తర్వాత కస్టమర్ తన డీటేల్స్‌‌ ఇవ్వాల్సి ఉంటుంది. 


కస్టమర్ వృత్తి, నెలవారి ఆదాయం వంటి డీటేల్స్‌‌ నమోదు చేసి గోల్డ్ లోన్ అప్లికేషన్‌‌ను (Gold loan application) సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 


అనంతరం గోల్డ్‌‌ను బ్యాంకుకు తీసుకువెళ్లి రెండు ఫోటోలు, కేవైసీ డాక్యుమెంట్లను (Gold loan documents KYC) బ్యాంక్‌‌కు ఇవ్వాల్సి ఉంటుంది. 


లోన్ డాక్యుమెంట్లపై దరఖాస్తుదారులు సంతకాలు పెడితే గోల్డ్ లోన్ మొత్తాన్ని కస్టమర్ బ్యాంకు ఖాతాలో (Bank account) జమ చేస్తారు.