Second Hand Cars Selling: ప్రస్తుతం చాలా మంది కొత్త కార్ల కంటే సెకెండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. మరికొందరు తమ పాత కార్లను అమ్మేసి.. కొత్త కార్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సెకెండ్ హ్యాండ్ కార్ల బిజినెస్‌ కూడా పుంజుకుంది. చాలా కంపెనీలు పాత కార్ల వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చాయి. అయితే చాలా మంది తమ పాత కారును ఎంత ధరకు ఇవ్వాలి..? బెస్ట్ రేటు ఎలా పొందాలి..? అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. కొంతమంది కారు మెకానిక్‌లను, తమకు తెలిసిన వాళ్లను అడిగి తమ పాత కార్లకు రేట్లు ఫిక్స్ చేసుకుంటూ ఉంటారు. కొన్ని టిప్స్ పాటించి.. పాత కార్లను కూడ మంచి ధరకు విక్రయించవచ్చు. ఎలాగంటే..?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

==> మీ పాత కారును విక్రయించాలనుకున్నప్పుడు ముందుగా అన్ని పేపర్లు సిద్ధంగా ఉంచుకోండి. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, సర్వీస్ హిస్టరీ, పొల్యూషన్ సర్టిఫికెట్ వంటి అన్ని కీలక పత్రాలను ముందుగా రెడీ చేసి పెట్టుకోండి. మీ కారు కొనుగోలు చేసేందుకు కస్టమర్ వచ్చినట్లయితే.. ఆ పత్రాలను చూపించి క్లారిటీగా వివరించండి. మీ కారు ఏ సమస్యలు ఉన్నా.. నిజాయితీగా చెప్పండి. కారు ప్లస్ పాయింట్లు ఎక్కువగా చెప్పేందుకు ప్రయత్నించండి.   


==> మీ కారును కొనేందుకు కస్టమర్ వస్తాడని తెలిసినప్పుడు ముందుగా సర్వీస్ చేయించండి. కస్టమర్ టెస్ట్ డ్రైవ్ చేసేందుకు వచ్చిన్నప్పుడు కారు బాగా పనిచేస్తుంది. ఆ సమయంలో కారు మంచి పనితీరును కనబరిస్తే.. బెస్ట్ ప్రైస్ లభించే అవకాశం ఉంటుంది. 


==> కారును శుభ్రంగా ఉంచుకుని.. అందంగా ముస్తబు చేసుకోండి. సెకెండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసే ముందు చాలా మంది కస్టమర్లు కారు కండీషన్ ఎలా ఉంది..? మెయింటెన్స్ ఎలా ఉంది..? ఇంజిన్ ఎలా ఉంది..? టైర్లు ఎలా ఉన్నాయి..? అని చూసుకుంటారు. కస్టమర్ మీ వద్దకు రాకముందే.. శుభ్రంగా ఉంచి కండీషన్ బాగా ఉండేలా చూసుకోండి.


==> మీరు ముందుగా విక్రయించాలని అనుకున్న ధర కంటే కాస్త ఎక్కువ రేటునే కస్టమర్‌కు చెప్పండి. కస్టమర్‌తో మాట్లాడే సమయంలో ధర తగ్గించాలని కోరడం ఖాయం. ఈ క్రమంలో మీరు రేటు తగ్గించినా.. ముందుగా మీ అనుకున్న ధర లభించే అవకాశం ఉంటుంది. 


Also Read: Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరంలో ఈ విశేషాలు తెలుసా..


Also Read: Suryavanshi Thakur: ఐదు వందల ఏళ్ల తర్వాత నెరవేరిన శపథం.. పట్టువదలని సూర్యవంశి ఠాకూర్‌ వంశీయులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter