Mahindra Scorpio Cars: రూ. 16.50 లక్షల SUV కారు కేవలం 8 లక్షలే..
Mahindra Scorpio Second Hand Car: స్కార్పియో కారు కొనాలనే కోరిక ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి.. అయితే, కొత్త స్కార్పియో వాహనాన్ని కొనుగోలు చేయలేకపోతున్నామే అని దిగులు పడాల్సిన పనిలేదు. ఎందుకంటే కొత్త స్కార్పియో కారును కొనేంత బడ్జెట్ లేని వారి కోసం మార్కెట్లో యూజ్డ్ కార్లు సిద్ధంగా ఉన్నాయి. ఉపయోగించిన వాహనాలను కొనుగోలు చేసి విక్రయించేందుకు అనేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి.
Mahindra Scorpio Second Hand Car: ఇండియాలో బాగా పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కార్లలో మహీంద్రా స్కార్పియో కూడా ఒకటి అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మహీంద్రా అండ్ మహీంద్రాలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో స్కార్పియో ఎన్ సంఖ్య చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది. గతేడాదే స్కార్పియో ఎన్ కారు లాంచ్ అవగా.. ఆ తరువాత పాత స్కార్పియో కారును అప్ గ్రేడ్ చేసి స్కార్పియో క్లాసిక్ గా రీడిజైన్ చేసి కస్టమర్స్ ముందుకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి మహీంద్రా అండ్ మహీంద్రాలో ఈ రెండు వాహనాలకు భారీ స్పందన కనిపిస్తోంది.
స్కార్పియో కారు కొనాలనే కోరిక ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి.. అయితే, కొత్త స్కార్పియో వాహనాన్ని కొనుగోలు చేయలేకపోతున్నామే అని దిగులు పడాల్సిన పనిలేదు. ఎందుకంటే కొత్త స్కార్పియో కారును కొనేంత బడ్జెట్ లేని వారి కోసం మార్కెట్లో యూజ్డ్ కార్లు సిద్ధంగా ఉన్నాయి. ఉపయోగించిన వాహనాలను కొనుగోలు చేసి విక్రయించేందుకు అనేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. అలాంటి ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ లో ఓఎల్ఎక్స్ కూడా ఒకటి.
అలా ఓఎల్ఎక్స్‌లో యూజ్డ్ స్కార్పియో కారు డీల్ ఒకటి రెడీగా ఉంది. 2015 ఏడాదికి చెందిన మహీంద్రా స్కార్పియో S8 రూ. 8.10 లక్షలు పలుకుతోంది. ఓఎల్ఎక్స్ లక్నోలో అమ్మకానికి అందుబాటులో ఉన్న ఈ స్కార్పియో డీజిల్ ఇంజిన్ వెర్షన్ కారు ఇప్పటి వరకు 82,155 కిమీ రన్ అయింది. ఈ కారును ఇప్పటివరకు ఒక్క యజమానే నడిపించారు. 2016 మోడల్ కి చెందిన మరో స్కార్పియో కారు కూడా కేవలం ధర రూ. 8.10 లక్షలకే అమ్మకానికి సిద్ధంగా ఉంది. మీరట్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న డీజిల్ ఇంజన్ కారు 65,800 కిమీలు మాత్రమే రన్ అయింది.
2015 ఇయర్‌కి చెందిన మహీంద్రా స్కార్పియో S10 AT 2WD కారు కూడా అమ్మకానికి సిద్ధంగా ఉన్నప్పటికీ.. దీనికి ఒక లక్ష రూపాయలు ఎక్కువ డిమాంజ్ చేస్తున్నారు. అంటే ఈ కారు సొంతం చేసుకోవాలంటే.. రూ. 9.15 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. ఓఎల్ఎక్స్ మీరట్ సిటీలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఈ డీజిల్ కారు.. 75,000 కి.మీ నడిచింది. ఈ కారును ప్రస్తుతం విక్రయిస్తున్న వ్యక్తి ఈ కారుకు రెండో యజమాని.
ఇవే కాకుండా 2018 ఇయర్ మోడల్ కి చెందిన మహీంద్రా స్కార్పియో S6 7 సీటర్ కూడా మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఈ కారు ఖరీదు రూ. 9.20 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. అంబేద్కర్‌నగర్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఈ కారు ఇప్పటికే 80,000 కిమీ రన్ అయింది. ఈ డీజిల్ ఇంజన్ కారును అమ్ముతున్న ప్రస్తుత వ్యక్తి ఈ కారుకు రెండో యజమాని. ఇలా ఆల్రెడీ ఉపయోగించిన అనేక కార్లు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. మీకు వాటి వర్కింగ్ కండిషన్ నచ్చినట్టయితే.. కొత్త కార్లతో పోల్చుకుంటే తక్కువ ధరలోనే ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ లేకుండా మీకు నచ్చిన కారును సొంతం చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి : CNG SUV CARS: త్వరలో మార్కెట్‌లో సీఎన్జీ బేస్డ్ ఎస్‌యూవీ కార్లు, ఫీచర్లు తెలిస్తే వదిలి పెట్టరిక
ఇది కూడా చదవండి : Royal Enfield Classic 350: కేవలం 50 వేలు చెల్లించి 5 వేల ఈఎంఐతో మీ సొంతం చేసుకోండి
ఇది కూడా చదవండి : Cheapest 7 Seater car: దేశంలో డెడ్ ఛీప్ 7 సీటర్ కారు ఇదే.. ధర కేవలం రూ.10 లక్షలే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Faceboo