Selling 50 Paisa Coin: పాత నోట్లు, నాణేలకు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. కాలక్రమంలో చాలావరకు పాత నోట్లు, నాణేలు ఇప్పుడు వాడుకలో లేకుండా పోయాయి. అలాంటి నోట్లు, నాణేలు ఇప్పుడు ఓఎల్‌ఎక్స్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో  భారీ ధర పలుకుతున్నాయి. అలాంటి నాణేల్లో 50 పైసల నాణెం కూడా ఉంది. నిజానికి ఇప్పటికీ దీని వాడకంపై నిషేధమేమీ లేదు. కానీ ప్రస్తుతం చాలా తక్కువ మంది వద్ద మాత్రమే ఈ నాణెం అందుబాటులో ఉంది. దీంతో ఈ నాణేనికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీ వద్ద 2011 సంవత్సరపు నాణెం ఉందా?


2011లో కేంద్ర ప్రభుత్వం 25 పైసలు అంతకన్నా తక్కువ విలువ కలిగిన నాణేలను రద్దు చేసింది. 50 పైసల నాణెం మాత్రం ఇప్పటికీ చట్టబద్దంగా చెల్లుబాటు అవుతూనే ఉంది. అయితే 50 పైసల ఉత్పత్తిని కేంద్రం నిలిపివేయడం.. ద్రవ్యోల్బణ పరిస్థితులతో ఈ నాణెం వాడుక తగ్గిపోయింది. ప్రస్తుతం కొద్ది మంది వద్ద మాత్రమే పాత 50 పైసల నాణెం అందుబాటులో ఉంది. 


ఓఎల్ఎక్స్‌లో రూ.1 లక్ష వరకు :


సెకండ్ హ్యాండ్ వస్తువులు విక్రయించే ఓఎల్ఎక్స్ సైట్‌లో 50 పైసల నాణేనికి రూ.1 లక్ష వరకు ధర పలుకుతోంది. అయితే అంత ధర పలుకుతున్న 50 పైసల నాణెం 2011లో విడుదల చేయబడినదనే ప్రచారం కూడా ఉంది. చాలామంది ఇప్పుడీ పాత నాణేన్ని ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి పెడుతున్నారు. ఓఎల్ఎక్స్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకుంటే చాలు.. ఎవరైనా ఇందులో వస్తువులను అమ్మకానికి పెట్టవచ్చు. మీ వద్ద పాత నాణేలు ఉంటే.. మీరూ ఓఎల్ఎక్స్‌లో విక్రయించి భారీగా సొమ్ము చేసుకోవచ్చు. 


Also Read: Puvvada Ajay Kumar: పోలవరం ప్రాజెక్ట్‌ ఎత్తు తగ్గించండి..మంత్రి పువ్వాడ అజయ్‌ కీలక వ్యాఖ్యలు..!


Also Read: Acharya: ఆచార్యను వెంటాడుతున్న కష్టాలు... మరో ఘోర పరాభవం?



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook