Acharya: ఆచార్యను వెంటాడుతున్న కష్టాలు... మరో ఘోర పరాభవం?

Gemini Tv Shock To Acharya Makers: ఆచార్య సినిమా కష్టాలు ఇప్పట్లో తొలగేలా కనిపించడం లేదు. తాజాగా శాటిలైట్ హక్కులు కొనుక్కున్న జెమినీ షాక్ ఇచ్చినట్టు చెబుతోంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 19, 2022, 01:56 PM IST
  • ఆచార్య మేకర్స్ కు తీరని కష్టాలు
  • కొరటాల శివ సెటిల్మెంట్ విషయంలో మరో ట్విస్ట్
  • వెనక్కు తగ్గిన జెమినీ సంస్థ
Acharya: ఆచార్యను వెంటాడుతున్న కష్టాలు... మరో ఘోర పరాభవం?

Gemini Tv Shock To Acharya Makers: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసిన నటించిన ఆచార్య సినిమా కష్టాలు ఇప్పట్లో తొలగేలా కనిపించడం లేదు. ఆచార్య సినిమా సూపర్ హిట్ అవుతుంది అనుకుంటే భారీ డిజాస్టర్ గా నిలవడంతో మునుపెన్నడూ జరగని ఘటనలు కూడా టాలీవుడ్ లో చోటు చేసుకుంటున్నాయి. ఈ సినిమా వల్ల చాలా మంది బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు. కానీ కొరటాల శివ తనకు తెలిసి డిస్ట్రిబ్యూటర్లలో కొంత మందికి సహాయం చేశారని ప్రచారం జరిగిన నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు అందరూ కలిసి కొరటాల ఆఫీసుకు వచ్చి కూర్చోవడంతో ఒక పక్క నిరంజన్ రెడ్డితో మరొక మెగాస్టార్ చిరంజీవి వంటి వారితో మాట్లాడించి ఆ ఇష్యుని కొంతవరకు సెటిల్ చేయడంలో కొరటాల సక్సెస్ అయ్యారు.

అయితే ఆచార్యకు రావాల్సిన బకాయిలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని తీసుకుని డిస్ట్రిబ్యూటర్లకు కొంత మేర సెటిల్మెంట్ చేయవచ్చని భావించారు. అలాంటి బాకీలలో శాటిలైట్ రైట్స్ కూడా ఒకటి. ఆచార్య సినిమా శాటిలైట్ రైట్స్ జెమినీ టీవీ కొనుక్కుంది. ఏకంగా 15 కోట్ల రూపాయల మేర ఖర్చు చేసి సినిమా విడుదలకు ముందే ఈ హక్కులు కొన్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ సినిమాకు కొంతమేర అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చేసుకున్నారని పూర్తిస్థాయిలో డబ్బులు మాత్రం ఇవ్వలేదని అంటున్నారు. ఆ డబ్బులు వస్తే ఇప్పుడు కొంత వాటితో డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు చెల్లించి సైడ్ అవ్వాలి అనుకున్నారు.

కానీ ఇప్పుడు ఆ డబ్బులు కూడా రావడం కష్టమే అని అంటున్నారు. ఇప్పుడు 15 కోట్ల రూపాయలలో మిగిలిన డబ్బులు ఇవ్వడానికి జెమినీ వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచిన నేపధ్యంలో ఒకవేళ టీవీలో వేయాలన్నా వారికి యాడ్స్ దొరకవు. యాడ్స్ లేకుండా సినిమా వేయడం కూడా అనవసరం అని వాళ్ళు భావిస్తున్నారట. అందుకే ఇప్పుడు గతంలో ఉన్న అగ్రిమెంట్లను బూచిగా చూపి తప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే ఈ సినిమా జెమినీకి అమ్ముతున్న సమయంలో సినిమాలో కాజల్ అగర్వాల్ కూడా ఉన్నట్లుగా కొరటాల శివ అండ్ టీం వెల్లడించింది.

ఇప్పుడు అసలు కొరటాల కాజల్ అగర్వాల్ క్యారెక్టర్ మొత్తాన్ని తీసివేయడంతో అగ్రిమెంట్ తప్పారు కాబట్టి అసలు మీ సినిమా మాకు వద్దు,  మేము తీసుకోము అని అడ్డం తిరిగిందట టీవీ యాజమాన్యం. లేదా అనుకున్న డీల్ ని సగానికి సగం తగ్గించి అంటే ఏడున్నర కోట్ల రూపాయలకి అయితే మేము తీసుకుంటామని చెబుతోందట. సినిమాని వెనక్కి తీసుకుంటే జెమినీ నుంచి తీసుకున్న అడ్వాన్స్ కూడా వాళ్ళకి ఇచ్చేయాల్సి ఉంటుంది.  లేదా సగానికి సర్దుకుపోవాలి అనుకుంటే ఏడున్నర కోట్ల రూపాయలు నష్టపోవాల్సి ఉంటుంది. ఇది పెద్ద దెబ్బే అని టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Also Read: Chiranjeevi: చిరంజీవిపై సీపీఐ నారాయణ అనుచిత వ్యాఖ్యలు... చిల్లర బేరగాడంటూ!

Also Read: Srinu Vaitla: ఆ హీరోయిన్ వల్లే విడాకుల దాకా శ్రీను వైట్ల వ్యవహారం? 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News