Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కూడా భారీ నష్టాలతో ముగిశాయి. మార్కెట్లకు నష్టాలు రావడం వరుసగా ఇది వరుసగా మూడో సెషన్​. నేటి సెషన్​లో బీఎస్​ఈ-సెన్సెక్స్​ 575 పాయింట్లు కోల్పోయి 59,034 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 168 పాయింట్లు నష్టంతో 17,639 వద్దకు దిగొచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతర్జాతీయ ప్రతికూలతలు, రష్యాపై ఐరోపా దేశాలు మరిన్న ఆంక్షలు విధించొచ్చన్న అంచనాల నడుమ ప్రతికూలక పవనాలు కొనసాగాయి. దీనికితోడు హెచ్​డీఎఫ్​సీ జంట షేర్లు, ఐటీ షేర్లు డీలా పడటం నష్టాలకు కారణంగా తెలుస్తోంది.


సూచీల కదలికలు ఇలా..


ఇంట్రాడేలో సెన్సెక్స్ 59,504 పాయింట్ల అత్యధిక స్థాయిని నమోదు చేసింది.   58,977 కనిష్ఠానికీ పడిపోయింది.


నిఫ్టీ అత్యధికంగా 17,787 పాయింట్ల స్థాయిని తాకింది. అత్యల్పంగా 17,623 స్థాయిని కూడా చేరింది.


నేటి సెషన్​లో టాప్​-5 షేర్లు..


యాక్సిస్​ బ్యాంక్​ 2.31 శాతం, హెచ్​యూఎల్​ 1.27 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.98 శాతం, ఎం&ఎం 0.88 శాతం, డాక్టర్ రెడ్డీస్​ 0.87 శాతం లాభాలను గడించాయి.


టైటాన్​ 3.32 శాతం, హెచ్​డీఎఫ్​సీ 2.74 శాతం, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ 1.99 శాతం, టీసీఎస్​ 1.97 శాతం, విప్రో 1.90 శాతం నష్టాలను నమోదు చేశాయి.


Also read: Google New Feature: టోల్ గేట్స్ పై అదిరే ఫీచర్‌ ప్రవేశపెట్టిన గూగుల్ మ్యాప్స్‌


Also read: EPF Interest Credit: EPFO ఖాతాలో వడ్డీ ఎంత వచ్చిందో తెలుసుకోవడానికి ఇలా చేయండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook