EPF Interest Credit: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇటీవల 2021-22 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ ఖాతాలోని డబ్బుపై వడ్డీ రేటును 0.40 శాతం తగ్గించింది. దీంతో ఆ వడ్డీ శాతం 8.10%కి తరిగింది. కొన్ని మీడియా కథనాల ప్రకారం.. ఈ ఏడాది జులై నాటికి పీఎఫ్ ఖాతాలోని డబ్బుకు వడ్డీ మీ ఖాతాలో జమ కావొచ్చు. ఈ క్రమంలో మీ ఖాతాలో వడ్డీ ఎంత వచ్చిందో తెలుసుకునేందుకు ఇలా చేయండి.
మిస్ట్ కాల్ ద్వారా పూర్తి సమాచారం..
PF ఖాతాకు లింక్ చేయబడిన రిజిస్టర్ నంబర్ నుండి 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఆ వెంటనే మీ రిజిస్టర్డ్ నంబర్‌కు సందేశం వస్తుంది. అందులో మీ PF బ్యాలెన్స్ గురించి సమాచారం అందుబాటులో ఉంటుంది.
SMS ద్వారా బ్యాలెన్స్ చెకింగ్..
EPFOతో నమోదు చేసుకున్న మొబైల్ నంబర్ నుండి 7738299899కి EPFO UAN LAN (భాష)ని టైప్ చేసి SMS చేయాలి. ఇక్కడ LAN అంటే మీ భాష. మీకు ఆంగ్లంలో సమాచారం కావాలంటే, LANకి బదులుగా మీరు ENG అని వ్రాయాలి. అదేవిధంగా, తెలుగులో సమాచారాన్ని పొందేందుకు TEL, హిందీకి HIN, తమిళం కోసం TAM అని టైప్ చేసి SMS చేయాలి. తెలుగులో సమాచారాన్ని పొందడానికి, EPFO UAN TEL అని టైప్ చేసి.. 7738299899కి SMS చేయాలి.
UMANG యాప్‌లోనూ చెక్ చేయోచ్చు..
మీ EPFO ఖాతా గురించి పూర్తి వివరాలను UMANG యాప్ ద్వారా కావాల్సిన సమయంలో చెక్ చేసుకోవచ్చు. దాని కోసం UMANG యాప్‌లోని EPFOపై క్లిక్ చేయండి. ఇందులో ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీసెస్‌పై క్లిక్ చేయాలి. దీని తర్వాత వ్యూ పాస్‌బుక్‌పై క్లిక్ చేసి, UAN, పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దాన్ని నమోదు చేసిన తర్వాత, మీరు EPF బ్యాలెన్స్‌ని తనిఖీ చేయవచ్చు. మీ ఖాతాలో ఎంత వడ్డీ జమ అయ్యిందో కూడా పాస్ బుక్ లో తెలిసిపోతుంది.
Also Read: Petrol Diesel Price: వాహనదారులకు శుభవార్త.. పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతంటే?
Also Read: Old Currency Sale: ఈ పాత కరెన్సీ నోట్లు మీ దగ్గర ఉంటే రాత్రికి రాత్రే లక్షాధికారి అవ్వొచ్చు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook