Stock Market Updates: స్టాక్ మార్కెట్లలో వరుసగా మూడు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. వారాంతపు సెషన్​లో (శుక్రవారం) (Stocks closing bell) సూచీలు స్వల్ప నష్టాలను నమోదు చేశాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్​ (BSE Sensex) 20 పాయింట్లు తగ్గి.. 58,786 వద్దకు చేరింది. నేషనల్​ స్టాక్ ఎక్స్ఛేంజీ-నిఫ్టీ (NSE Nify) 17 పాయింట్ల అతి స్వల్ప నష్టంతో 17,500 వద్ద స్థిరపడింది.


ఇటీవలి వరుస లాభాలను మదుపరులు సొమ్ము చేసుకోవడం నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనికి తోడు దేశీయంగా వెంటాడుతున్న ఒమిక్రాన్ వేరియంట్ భయాలు కూడా నష్టాలకు కారణమైనట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ఈ రోజు సెషన్​ ఎలా సాగిందంటే..


ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్​  58,859 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. రికార్డు స్థాయిలో అమ్మకాల కారణంగా ఒకానొక దశలో 58,414 కనిష్ఠానికి పడిపోయింది.


నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 17,534 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 17,405 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.


లాభ నష్టాల్లో టాప్​-5 షేర్లు..


బీఎస్​ఈ 30 షేర్ల ఇండెక్స్​లో 11 కంపెనీలు సానుకూలంగా స్పందించగా.. 19 కంపెనీలు డీలా పడ్డాయి.


ఏషియన్ పెయింట్స్ 3.03 శాతం, ఎస్​బీఐ 1.27 శాతం, ఎం&ఎం 0.70 శాతం, బజాజ్ ఫిన్​సర్వ్​ 0.69 శాతం, టీసీఎస్​ 0.64 శాతం లాభాలను గడించాయి.


టైటాన్​ 1.54 శాతం, హెచ్​డీఎఫ్​సీ 1.19 శాతం, యాక్సిస్​ బ్యాంక్ 0.94 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్​ 0.76 శాతం, భారతీ ఎయిర్​టెల్​ 0.63 శాతం నష్టాలతో ముగిశాయి.


ఆసియాలో ఇతర మార్కెట్లు..


ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. షాంఘై (చైనా), టోక్యో (జపాన్​), సియోల్​ (దక్షిణ కొరియా), థైవాన్​, హాంకాంగ్ సూచీలు సైతం నష్టాలను మూటగట్టుకున్నాయి.


రూపాయి విలువ..


డాలర్​తో పోలిస్తే రూపాయి (Rupee value today) విలువ 24 పైసలు క్షీణించింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 75.76 వద్ద కొనసాగుతోంది.


Also read: SBI services down: రేపు ఆ 5 గంటలు ఎస్​బీఐ సేవలకు అంతరాయం!


Also read: Royal Enfield New Bike : రాయల్ ఎన్‌ఫీల్డ్‌ నుంచి కొత్త బైక్, తక్కువ ధరకు అదిరిపోయే ఫీచర్స్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook