SBI services down: రేపు ఆ 5 గంటలు ఎస్​బీఐ సేవలకు అంతరాయం!

మీరు ఎస్​బీఐ కస్టమరా? అయితే ఈ విషయాలు మీరు కత్చితంగా తెలుసుకోవాలి. ఎస్​బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో యాప్​ సహా ఇంటర్నెట్ అధారంగా పనిచే సే అన్ని సేవలకు రేపు (శనివారం) అంతరాయం (Interruption in SBI services) ఏర్పడనుంది. ఈ విషయాన్ని బ్యాంక్ స్వయంగా వెల్లడించింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 10, 2021, 03:24 PM IST
  • ఖాతాదారులకు ఎస్​బీఐ కీలక సూచనలు
  • శనివారం ఎస్​బీఐ సేవలకు అంతరాయం
  • దాదాపు 5 గంటలు నిలిచిపోనున్న పలు సర్వీసులు
SBI services down: రేపు ఆ 5 గంటలు ఎస్​బీఐ సేవలకు అంతరాయం!

SBI Internet services will be unavailable tomorrow: మీరు ఎస్​బీఐ కస్టమరా? అయితే ఈ విషయాలు మీరు కత్చితంగా తెలుసుకోవాలి. ఎస్​బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో యాప్​ సహా ఇంటర్నెట్ అధారంగా పనిచే సే అన్ని సేవలకు రేపు (శనివారం) అంతరాయం (Interruption in SBI services) ఏర్పడనుంది. ఈ విషయాన్ని బ్యాంక్ స్వయంగా వెల్లడించింది.

శనివారం (డిసెంబర్ 11) రాత్రి 11:30 గంటల నుంచి మరుసటి రోజు (డిసెంబర్ 12 ఆదివారం) తెల్లవారుజామున 4:30 వరకు సేవలు నిలిచిపోనున్నాయని ట్విట్టర్ ద్వారా తెలిపింది ఎస్​బీఐ.

ఈ సమయంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్​, యోనో బిజినెస్​,యూపీఐ సేవలు (SBI internet banking to be down) పని చేయవని తెలిపింది. యూజర్లకు కలిగిస్తున్న అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది ఎస్​బీఐ.

కారణాలు ఏమిటి?

బ్యాంక్​ సేవలను మరింత మెరుగు పరిచేందుకు సిస్టమ్స్​​ అప్​గ్రేడ్​ చేయనున్నట్లు ఎస్​బీఐ వెల్లడించింది. ఈ కారణంగానే ఇంటర్నెట్ ఆధారిత సేవలకు అంతరాయం ఏర్పడుతుందని (SBI services to be down) స్పష్టం చేసింది. ఇందుకు సహకరించాలని వినియోగదారులను కోరింది. సిస్టమ్ అప్​గ్రేడ్ సమయాల్లో లావాదేవీల జరపకుండా ఉండటమే మంచిదని సూచించింది.

ఇంతకు ముందు కూడా చాలా సార్లు సిస్టమ్​ అప్​గ్రేడ్ పేరిట ఎస్​బీఐ ఇంటర్నెట్ ఆధారిత సేవలను నిలిపివేసింది. ఇప్పుడు కూడా అలాంటి కారణలతోనే బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది.

ఎస్​బీఐ గురించి..

ఎస్​బీఐ దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వం రంగ బ్యాంకు. దేశవ్యాప్తంగా ఎస్​బీఐకి 22 వేల బ్రాంచ్​లు 62,617 ఏటీఎంలు ఉన్నాయి. మొత్తం 45 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. భారత్ కాకుండా మరో 31 దేశాల్లో ఎస్​బీఐ కార్యకలాపాలు సాగిస్తోంది. ఆయా దేశాల్లో 229 ఆఫీసులున్నాయి.

Also read: Amazon iPhone XR Sale: రూ.18,599లకే Apple iPhone మీ సొంతం చేసుకోండిలా!

Also read: EPFO : మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. రూ.7 లక్షల ప్రయోజనం పొందండిలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News