Shaktikanta Das: ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్ పదవి కాలాన్ని (Shaktikanta Das reappointment) పొడగించింది కేంద్ర ప్రభుత్వం. మరో మూడేళ్లపాటు దాస్ ఆ పదవిలో కొనసాగనున్నట్లు ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పునర్నియామకం ఈ ఏడాది డిసెంబరు 12 నుంచి అమలులో ఉంటుందని వెల్లడించింది ప్రభుత్వం.


నిజానికి ఈ ఏడాది డిసెంబర్ 10తో దాస్ పదవీ కాలం ముగియాల్సి ఉంది. అయితే క్యాబినేట్ నియామకాల కమిటీ ఆయన్ను మరోసారి గవర్నర్ గా పునర్నియమిస్తూ.. తాజాగా నిర్ణయం తీసుకుంది. మరో మూడేళ్ల పాటు లేదా.. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు శక్తికాంత దాస్ ఆ పదవిలో కొనసాగుతారని అధికారిక ప్రకటనలో పేర్కొంది.


Also read: Facebook: ఫేస్‌బుక్ కంపెనీ పేరు మారింది.. మెటా కిందకు వచ్చిన ఫేస్‌బుక్‌ యాప్స్


Also read: 5G Network: ఇండియాలో 5జీ నెట్‌వర్క్ మరింత ఆలస్యం కానుందా, కారణమేంటి


శక్తికాంత దాస్ గురించి..


శక్తికాంత దాస్ 2018 డిసెంబర్ లో ఆర్ బీఐ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న దాస్ 2020లో ఆ బాధ్యతల నుంచి పదవీ విరమణ పొందారు. 15వ ఫినాన్స్ కమిషన్ లో సభ్యుడిగా కూడా వ్యవహరించారు దాస్.


శక్తికాంత దాస్ 1957లో ఒడిశాలో జన్మించారు. 1980 ఐఏఎస్ తమిళనాడు క్యాడెర్ కు చెందిన దాస్ వివిధ ప్రభుత్వ శాఖల్లో సేవలందించారు. ఆర్థిక కార్యదర్శి, రెవెన్యూ కార్యదర్శి, ఫర్టిలైజర్ విభాగ కార్యదర్శి సహా వివిధ విభాగాల్లో పని చేశారు.


వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, ఎన్ డీబీ, ఏఐఐబీ వంటి సంస్థలకు భారత్ తరఫున ప్రత్యామ్నాయ గవర్నర్ గా కూడా వ్యవహరించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), జీ20, బ్రిక్స్, సార్క్ వంటి అంతర్జాతీయ వేదికల్లో భారత్ తరఫున ప్రతినిధిగా కూడా వ్యవహరించిన అనుభవం దాస్ కు ఉంది.


Also read: NYKAA IPO: నైకా ఐపీఓ షురూ- ఒక్కో ఈక్విటీ షేరు ధర ఎంతంటే?


Also read: LPG Price hike: మరోసారి వంట గ్యాస్ ధరల మంట- వచ్చే వారం రూ.100 వరకు పెరిగే అవకాశం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook