Multibagger stocks: నాడు లక్ష రూపాయల పెట్టుబడి..ఇప్పుడు 3 కోట్ల రూపాయలు
Multibagger stocks: స్వల్పకాలంలో ఎక్కువ లాభాలిచ్చే షేర్లను మల్టీబ్యాగర్ స్టాక్స్‌గా పిలుస్తారు. షేర్ మార్కెట్‌లో అలాంటి స్టాక్స్ చాలా ఉన్నాయి. ఆ షేర్ల గురించి తెలుసుకుందాం..
షేర్ మార్కెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది అంచనా వేయలేం. కొన్ని షేర్లు ఊహించని లాభాల్ని ఇస్తుంటాయి. ఒక్కోసారి కేవలం ఒకే ఒక షేర్ ఇన్వెస్టర్లను కోటీశ్వరులుగా మార్చుతుంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
స్వల్పకాలంలో అధిక లాభాలు ఇచ్చే మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో Aegis Logistics కంపెనీ షేర్ ఉంది. ఈ కంపెనీ షేర్ ఇన్వెస్టర్లను కోటీశ్వరుల్ని చేసింది. ఒకానొక సమయంలో కంపెనీ షేర్ 1 రూపాయి కంటే తక్కువే ఉంది. 1999 జనవరి 1 నాడు కంపెనీ షేర్ ధర కేవలం 60 పైసలుంది. ఇప్పుడీ షేర్ ధర ఆకాశాన్నంటుతోంది.
Aegis Logistics కంపెనీ షేర్ విలువ ఇప్పుడు 300 రూపాయలు దాటేసింది. 2021 జూన్ నాటికి కంపెనీ షేర్ క్లోజింగ్ ధర ఎన్ఎస్ఈలో 380.75 రూపాయలుంది. ఇప్పుడు ఈ కంపెనీ 52 వారాల గరిష్ట ధర 308 రూపాయలు కాగా, 52 వారాల కనిష్ట ధర 167.25 రూపాయలుంది. కంపెనీ షేర్ అక్టోబర్ 25, 2022 నాటికి 297.75 రూపాయలకు క్లోజ్ అయింది.
ఆ సమయంలో అంటే 1999 లేదా 2000 లో 1 రూపాయి ధరకు ఈ కంపెనీ షేర్‌ను లక్ష రూపాయల పెట్టుబడితో కొని ఉంటే..ఇప్పుడు 300 రూపాయల చొప్పున అదే లక్ష రూపాయలు 3 కోట్లుగా మారుండేది.
Also read: Multibagger stock: రెండేళ్లలో లక్ష రూపాయల్ని 14 లక్షలు చేసిన షేర్, ఎలాగంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook