Rakesh Jhunjhunwala: దేశంలో స్టాక్ మార్కెట్ దిగ్గజం, బిజినెస్ టైకూన్ గా చెప్పుకునే  రాకేశ్ ఝుంఝన్‌వాలా హఠాన్మరణం చెందారు. ఆయనకు ఇప్పుడు 62 సంవత్సరాలు. గుండెపోటుతో  తన నివాసంలోనే రాకేశ్ ఝుంఝన్‌వాలా చనిపోయారు. కొంత కాలంగా పలు ఆరోగ్య సమస్యలతో ఆయన బాధ పడుకున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో  రాకేశ్ ఝుంఝన్‌వాలా ఆదివారం ఉదయం హాస్పిటల్ కు తీసుకువచ్చారు. అయితే అతన్ని పరీక్షించిన వైద్యులు చనిపోయారని నిర్ధారించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చార్టర్డ్ అకౌంటెన్సీ పూర్తి చేయగానే స్టాక్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చారు  రాకేశ్ ఝుంఝన్‌వాలా. కొంత కాలానికే అందులో ఆరితేరిపోయాడు.  చిన్న వయసులోనే మార్కెట్‌పై పట్టు సాధించిన రాకేశ్ ఝుంఝన్‌వాలా.. బిగ్‌ బుల్‌పై స్వారీ చేస్తూ ఈక్విటీ మార్కెట్లలో చెలరేగిపోయారు. 5 వేల పెట్టుబడితో 11 వేల కోట్ల రూపాయలు సంపాందించారు.  భారత్ లో షేర్ మార్కెట్ లో అతను  'ఇండియాస్ వారెన్ బఫెట్', 'బిగ్ బుల్' గా రాకేశ్ ఝుంఝన్‌వాలా ప్రసిద్ధి చెందారు.  ఆగస్టు 7న ఎయిర్‌లైన్ కో అయిన అకాశ ఎయిర్ లైన్స్ ను కొనుగోలు చేశారు. ఆగష్టు 7న అకాస తన వాణిజ్యపరమైన ఆప్‌లను ప్రారంభించింది, దేశంలోని ఎక్కువ మంది ప్రజలు మళ్లీ విమానంలో ప్రయాణించడం ప్రారంభిస్తారనే ఆశావాద అంచనాతో తాను ఈ ప్రయత్నాన్ని చేపడుతున్నట్లు జున్‌జున్‌వాలా ప్రకటించారు. డిమాండ్ పరంగా భారతదేశ విమానయాన రంగంపై తాను చాలా చాలా బుల్లిష్‌గా ఉన్నానని చెప్పారు  రాకేశ్ ఝుంఝన్‌వాలా.


రాజస్థాన్‌లోని ఝున్‌ఝును నుంచి ముంబయికి వలస వచ్చింది ఝుంఝన్‌వాలా కుటుంబం. రాకేశ్ నాన్న రాధేశ్యామ్‌ ఐటీ శాఖ ఉద్యోగి.రాధేశ్యామ్‌ హైదరాబాద్‌లో పని చేస్తున్నప్పుడు ఝుంఝన్‌వాలా జన్మించారు. కుటుంబంలో అతనే చిన్నవాడు. ఝుంఝన్‌వాలాకు ఒక అన్న, ఇద్దరు అక్కలు. ఝుంఝన్‌వాలా రెండున్నర ఏళ్ల వయసులో రాధేశ్యామ్‌కు ముంబై ట్రాన్స్  ఫర్ అయింది. అప్పటి నుంచి ముంబైలోనే ఉండిపోయారు. తండ్రి ఐటీ ఉద్యోగి కావడంతో చిన్నప్పటి నుంచి షేర్ మార్కెట్ పై  ఆసక్తి ఉండేది. 12-13 ఏళ్ల వయసులోనే షేర్లనీ గమనించేవారు. సీఏ పూర్తి కాగానే 1985లో స్టాక్‌ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు  ఝుంఝన్‌వాలా. తండ్రి వద్దని వారిస్తున్నా ఛార్టెర్డ్‌ అకౌంటెంట్‌గా ప్రాక్టీసు చేస్తూనే తమ అన్నయ్య రాజేష్‌ దగ్గర  5 వేల రూపాయలు తీసుకుని ట్రేడింగ్ మొదలు పెట్టారు. మొదట టాటా పవర్‌, టాటా టీ షేర్లు కొన్నారు టాటా టీ షేరుతో 3 నెలల్లోనే  ఝుంఝన్‌వాలాకు త్రిపుల్ ఆదాయం వచ్చింది. ఆ లాభాలతో ఇనుము తవ్వకం జరిపే ‘సెసా గోవా’లో నాలుగు లక్షల షేర్లు కొన్నారు. ఆ తర్వాత అలాఅలా పైకి ఎదిగిపోయారు ఝుంఝన్‌వాలా.



1993 నాటికి మార్కెట్‌లో  ఝుంఝన్‌వాలా  షేర్ల విలువ 200కోట్ల రూపాయలకు పెరిగింది. కార్గిల్‌ యుద్ధం, వైటూకే ప్రభావంతో 2002 వచ్చినా  ఝుంఝన్‌వాలా షేర్ల వాల్యూ 250 కోట్లుగానే ఉంది. 2003లో మళ్లీ స్టాక్ మార్కెట్ పుంజుకోవడంతో ఆదాయం ఒక్కసారిగి పెరిగిపోయింది. తర్వాత రియల్ ఎస్టేట్, మైనింగ్‌, రిటైల్‌, ఆయిల్‌, వైద్యసేవలు, బ్యాంకింగ్‌, నిర్మాణ రంగం, ఫార్మౌ రంగాల్లో ఎక్కువగా షేర్లు కొంటూ వచ్చారు  ఝుంఝన్‌వాలా.  2003-04లో సిమెంట్‌ కంపెనీల షేర్లు బాగా పెరగడంతో ఝుంఝన్‌వాలా సంపాదన ఊహించనంతగా పెరిగిపోయింది. డిమార్ట్‌  రాధాకిషన్‌ దమానీ, ఆయన సోదరుడు రమేష్‌, రాజీవ్‌ షాతో కలిసి చర్చించి షేర్లను కొనుగోలు చేసేవాడినని పలు ఇంటర్వ్యూల్లో  ఝుంఝన్‌వాలా చెప్పారు. గత మార్చి వరకు రాకేష్  ఝుంఝన్‌వాలా మొత్తం ఆస్తి ఫోర్బ్స్‌ అంచనా ప్రకారం 45 వేల కోట్ల రూపాయలు. ఇందులో మార్కెట్లలో షేర్ రూపంలో ఉన్నవే దాదాపు 20 వేల కోట్లు.1.5 లక్షల కోట్ల విలువ చేసే టైటాన్‌ మార్కెట్‌ విలువలో  ఝుంఝన్‌వాలాతో అతని భార్య రేఖకు  4.8 శాతం వాటా ఉంది. దీని విలువ  రూ .7200కోట్లు. ఇక టాటా మోటార్స్‌లో 15 వందల కోట్లు,  రేటింగ్స్‌ సంస్థ క్రిసిల్‌లో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టారు రాకేష్  ఝుంఝన్‌వాలా.


Read also: Naga Chaitanya: ప్రేయసితో పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికేసిన నాగచైతన్య !


Read also: Fact Check: ఆస్కార్ బరిలో ఎన్టీఆర్.. అసలు నిజం ఇదీ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook